సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల ఏజ్ గ్యాప్ గురించి తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది.ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమాలో సైతం హీరో హీరోయిన్ల పాత్రల మధ్య ఏజ్ గ్యాప్( Age Gap ) ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే.
అయితే ఈ ఏజ్ గ్యాప్ గురించి మనీషా కోయిరాలా( Manisha Koirala ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇండస్ట్రీలోని సీనియర్ నటీమణులకు ముఖ్యమైన పాత్రలు ఇవ్వాలని ఆమె అన్నారు.
వృద్ధాప్యం అనేది సినిమా ఇండస్ట్రీలో ఒక సమస్య కాదని మనీషా తెలిపారు.కానీ ఇది పరిష్కరించాల్సిన సామాజిక సమస్య అని ఆమె చెప్పుకొచ్చారు.ఎందుకంటే హీరోల ఏజ్ గురించి ఎవరూ కామెంట్స్ చేయడం నేను వినలేదని మనీషా కోయిరాలా అన్నారు.ఈ విషయంలో మహిళలనే ఎందుకు ట్రోల్ చేస్తారని ఆమె పేర్కొన్నారు.
సినిమ ఇండస్ట్రీలో సైతం ఇదే పరిస్థితి ఉందని మనీషా కోయిరాలా తెలిపారు.
మహిళలు ఎలాంటి పాత్రలైనా చేయగలరని మనీషా పేర్కొన్నారు.యాక్షన్ పాత్రలైనా అలవోకగా చేయగలరని ఆమె తెలిపారు.గతంలో ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు( Senior Heroines ) ఇది ప్రూవ్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు.
నేను ఎలాంటి పాత్రనైనా సవాలుగా స్వీకరిస్తారని మనీషా వెల్లడించారు.ఇప్పటికీ కొత్త పాత్రలు చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నానని మనీషా తెలిపారు.
మనీషా కోయిరాలా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మనీషా కోయిరాలా కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.మనీషా కోయిరాలా వయస్సు ప్రస్తుతం 54 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.రాబోయే రోజుల్లో మనీషా కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.హీరోయిన్ మనీషా కోయిరాలా 54 సంవత్సరాల వయస్సులో కూడా సినిమా ఆఫర్ల కోసం కష్టపడుతూ ఉండటంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.