మనిషి శరీరానికి పని చెప్పాలి.కానీ, అందుకు ఓ హద్దు ఉంటుంది.
కానీ, కొన్ని సందర్భాల్లో మనుషులే తమ దేహాన్ని దృఢంగా మార్చుకోవాలని, ఆ తర్వాత దానిని అందరికి చూపాలని ఈగ ప్రయత్నాలు చేస్తుంటారు.తాజాగా, ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్( Viral Video ) అవుతోంది.
ఓ వ్యక్తి ఇటుకతో( Brick ) చేసిన విన్యాసం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఈ వీడియో చూసిన వాళ్లు ‘‘ఇది కడుపు కాదు.
కాంక్రీటు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి కెమెరా ముందు నిలబడి తన టాలెంట్‌ను చూపించాడు.ఆ వ్యక్తి మొదట ఒక చేతిలో ఇటుక, మరొక చేతిలో సుత్తి పట్టుకుని, సుత్తితో( Hammer ) ఇటుకను గట్టిగా కొట్టాడు.దాంతో అది నిజమైన ఇటుక అని నిరూపించాడు.
తర్వాత ఆ ఇటుకను తన కడుపుపై బాదడం ప్రారంభించాడు.ఇలా పదేపదే తన కడుపుపై ఇటుకతో కొట్టుకుంటూ, తన కడుపు ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చూపించాడు.
ఎంత బలంగా కొట్టుకున్నా అతడి కడుపుపై( Stomach ) ఎలాంటి గాయాలు కానీ, అతడిలో ఎలాంటి బాధ కానీ కనిపించలేదు.చివరగా కెమెరా ముందు ఫోజులిస్తూ తన విన్యాసాన్ని ముగించాడు.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.ఈయన టాలెంట్ మామూలుగా లేదుగా అని కొందరు కామెంట్ చేస్తుంటే.మరికొందరేమో, పిచ్చి పరాకాష్టకు చేరడం అంటే ఇదే కాబోలు అని కామెంట్స్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో ని చూసి మీకేమనిపిచ్చిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి.