గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ), సతీమణి ఉపాసన( Upasana ) సినిమా ఇండస్ట్రీకి పరిచయం లేనప్పటికీ తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.ఇక ఉపాసన అపోలో హాస్పిటల్ వ్యవహారాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ తన మంచి మనసును చాటుకున్నారు.
ఇలా నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో కూడా ఎంతోమంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా అభిమానులకు ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక గుడ్ న్యూస్ చెప్పేశారు.
ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఒక హీరోయిన్ కి ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.అసలు విషయంలోకి వెళితే.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈ అమ్మడు మంగళవారం నాడు చిలుకూరి బాలాజీ టెంపుల్ దర్శనం చేసుకున్నారు.
ఇలా ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన ప్రియాంక చోప్రా కొత్త జర్నీ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది.ఈ మేరకు ఓ పోస్ట్ కూడా పెట్టింది.
ఇలా ప్రియాంక చోప్రా చేసిన పోస్ట్ కు మెగా కోడలు ఉపాసన రిప్లై ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది.మీ కొత్త చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.శ్రీ వేంకటేశ్వరుడు మిమ్ములను సమృద్ధిగా అనుగ్రహించునుగాక అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ఆ కొత్త సినిమా ఖచ్చితంగా మహేష్ బాబు( Mahesh Babu ) రాజమౌళి( Rajamouli ) సినిమా అని తెలుస్తుంది.
ఇటీవల మహేష్ బాబు సినిమా కోసం ప్రియాంక చోప్రా అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చారంటూ ఒక వార్త వైరల్ అయింది.ఇక తాజాగా ఉపాసన కూడా మీ కొత్త సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకోవడంతో కచ్చితంగా మహేష్ బాబు సినిమా గురించే అని అభిమానులు భావిస్తున్నారు.