టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలకు(mega heroes) ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.మెగా హీరోలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.
అయితే ఈ మధ్య కాలంలో మెగా హీరోలకు కెరీర్ పరంగా కలిసిరావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మెగా హీరోల సినిమాలు నిర్మాతలకు తీవ్రస్థాయిలో నష్టాలను మిగుల్చుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రామ్ చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే.ఆర్.ఆర్.ఆర్(RRR) సినిమాకు ముందు చరణ్ (Charan)నటించిన వినయ విధేయ రామ(Vinaya Vidheya Rama) కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.చిరంజీవికి ఆచార్య, భోళా శంకర్ (Chiranjeevi, Acharya, Bhola Shankar)సినిమాలతో ఒకింత భారీ షాకులు తగిలాయి.ఈ సినిమాలు నిర్మాతలకు సైతం భారీ నష్టాలను మిగిల్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించింది.
పవన్ కళ్యాణ్(pawan kalyan) గత సినిమా బ్రో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.వరుణ్ తేజ్(Varun Tej) ఈ మధ్య కాలంలో నటించిన ఆపరేషన్ వాలంటైన్, గాండీవధారి అర్జున, మట్కా (Operation Valentine, Gandhivadhari, Arjuna, Matka)సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.మెగా హీరోలకు వరుస షాకులు తగులుతుండటం నెట్టింట ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.
వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)సైతం ఆదికేశవ(Adikesava) సినిమాతో ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచారు.మెగా హీరోలు తర్వాత సినిమాలతో కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మెగా హీరోల క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
మెగా హీరోలు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు.పాన్ ఇండియా డైరెక్టర్లకు ఈ హీరోలు ఓటు వేయాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.