ఇటీవల కాలంలో రియల్ వీడియోల కోసం యువతి యువకులు తమ ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.అయితే రీసెంట్‌గా ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఇందులో 15 ఏళ్ల కుర్రాడు ప్రాణాలను పణంగా పెట్టి చేసిన ఓ షాకింగ్ స్టాండ్ చేశాడు.వీడియోలో, ఆ కుర్రాడు వేగంగా వస్తున్న రైలు వెళ్లే పట్టాల మధ్యలో పడుకుని, రైలు వెళ్లిపోయే వరకు అలాగే ఉండిపోయాడు.
ఈ ప్రమాదకరమైన స్టంట్‌ను అతని స్నేహితుడు వీడియో తీశాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో, మొదట ఆ కుర్రాడు రైలు పట్టాల ( train tracks )దగ్గర నిలబడి ఉండడం కనిపిస్తుంది.ఆ తర్వాత ఒక్కసారిగా రైలు వేగంగా వస్తుండగా పట్టాల మధ్యలో పడుకుంటాడు.
రైలు అతనిపైనుండి వెళ్లిపోతుంది.రైలు వెళ్లిపోయాక, ఆ కుర్రాడు లేచి నిలబడతాడు.
అదృష్టవశాత్తు అతనికి ఏమీ కాలేదు.ఈ వీడియో ఎక్కడ తీశారో కచ్చితంగా తెలియకపోయినా, ఇది బీహార్‌లో ( Bihar )జరిగి ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు.
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.కొందరు ఆ కుర్రాడిని తిడుతూ, ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయకుండా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.మరికొందరు మాత్రం అతన్ని ధైర్యవంతుడని మెచ్చుకుంటున్నారు.అయితే, ఇలాంటి స్టంట్స్ చాలా ప్రమాదకరమని, బాధ్యతారాహిత్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్‌ను సాధించింది, ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది.“ఈ కుర్రాడు ప్రతిరోజు ప్రమాదంతోనే బ్రేక్‌ఫాస్ట్ చేస్తాడు” అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే, “ఇతని కుటుంబ పరిస్థితి ఏంటి? ఇలాంటి స్టంట్స్ వల్ల వాళ్లకి ఎంత బాధ కలుగుతుందో ఆలోచించరా?” అని మరొకరు కామెంట్ చేశారు.కొందరు ఈ చర్యను సాహసంగా భావిస్తున్నా, చాలామంది మాత్రం ఇది ప్రమాదకరమైన సంకేతమని అంటున్నారు.