న్యూస్ రౌండప్ టాప్ 20

1.కృష్ణ నీటిపై సిడబ్ల్యుసి క్లారిటీ

Telugu Ap, Ceo Vikas Raj, Chandrababu, Congress, Jagan, Janasena, Janasenani, Ka

కృష్ణ జలాల నీటి పంచాయతీ పై కేంద్ర జల శక్తి శాఖ సమావేశం ముగిసింది.హైబ్రిడ్ పద్ధతిలో తెలుగు రాష్ట్రాల అధికారులతో గంటకు పైగా కేంద్ర జలవిద్యుత్ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నాగార్జునసాగర్ డ్యాం వద్ద నెలకొన్న ఉద్రిక్తత , తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల తరలింపు అంశాలపై చర్చించారు.ఏపీ తెలంగాణ అధికారులు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తారని కేంద్ర జల సంఘం చైర్మన్ వెల్లడించారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Brs, Bjp, C-TeluguStop.com

2.ఏపీలో తెలంగాణ పోలీసులపై కేసు నమోదు

నాగార్జునసాగర్ డ్యాం నుంచి నీటి విడుదల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన సంగతి తెలిసిందే.నిన్న ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో,  తెలంగాణ పోలీసులు తమ విధులను అడ్డుకున్నారని ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు

3.దుర్గమ్మ సేవలో చంద్రబాబు

Telugu Ap, Ceo Vikas Raj, Chandrababu, Congress, Jagan, Janasena, Janasenani, Ka

టిడిపి అధినేత చంద్రబాబు సతీ సమేతంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

4.కే ఏ పాల్ కామెంట్స్

హైదరాబాద్ ప్రజలు నా మాట విన్నారని నూటికి నలభై శాతం మాత్రమే ఓటు వేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.

5.నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్

Telugu Ap, Ceo Vikas Raj, Chandrababu, Congress, Jagan, Janasena, Janasenani, Ka

రేపు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంట్ జరుగనుంది.

6.లోకేష్ పై విమర్శలు

టిడిపి అధినేత చంద్రబాబు , ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్ర విమర్శలు చేశారు .నువ్వు ఎంత నీ బతుకు ఎంత లోకేష్ అంటూ మండిపడ్డారు.

7.తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ జూమ్ మీటింగ్

Telugu Ap, Ceo Vikas Raj, Chandrababu, Congress, Jagan, Janasena, Janasenani, Ka

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు.

8.లడక్ లో భూకంపం

లడక్ లో భూకంపం సంభవించింది.  రిక్టార్ స్కేల్ పై 3.4 గా తీవ్రత నమోదయింది.

9.పవన్ కళ్యాణ్ కామెంట్స్

Telugu Ap, Ceo Vikas Raj, Chandrababu, Congress, Jagan, Janasena, Janasenani, Ka

2024 లో టిడిపి జనసేన కలిసి ప్రభుత్వన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు .ఈరోజు పార్టీ కార్యాలయంలో మీడియాతో పవన్ మాట్లాడారు.

10.ఏపీలో ఇసుక అక్రమాలపై హైకోర్టులో పిటిషన్

ఏపీలో ఇసుక అక్రమాలు,  కాంట్రాక్ట్ ముగిసిన త్రవ్వకాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.  వేలకోట్ల రూపాయల నిధుల దుర్వినియోగంపై ఆధారాలతో సహా పిటిషన్ దాఖలయింది.

11.బై బై కేసీఆర్ అంటూ షర్మిల

Telugu Ap, Ceo Vikas Raj, Chandrababu, Congress, Jagan, Janasena, Janasenani, Ka

బై బై కేసీఆర్ ,కేసీఆర్ సూట్ కేసు పట్టుకుని సర్దుకునే టైం వచ్చింది.కేసీఆర్ గారు పేకప్ చేసుకోండి .బై బై కేసీఆర్ అంటూ షర్మిల వినూత్నంగా సెటైర్లు వేశారు.

12.తెలంగాణ వ్యాప్తంగా 49 కమిటీ కేంద్రాలు

తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు .19 నియోజకవర్గాల వారిగా కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు.

13.నేడు సీఈవో వికాస్ రాజ్ ను కలవనున్న టీ కాంగ్రెస్ నేతలు

Telugu Ap, Ceo Vikas Raj, Chandrababu, Congress, Jagan, Janasena, Janasenani, Ka

తెలంగాణ చీఫ్ ఎలక్షన్ అధికారి వికాస్ రాజ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈరోజు కలవనున్నారు.ప్రస్తుత ప్రభుత్వం రైతుబంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపునకు మళ్ళిస్తున్నారని కాంగ్రెస్ ఫిర్యాదు చేయనుంది.

14.మైనంపల్లి హనుమంతరావుపై అట్రాసిటీ కేసు

భోపాల్ లో పోలింగ్ పూర్తయిన అనంతరం బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య జరిగిన గొడవలో బీఆర్ఎస్ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై అట్రాసిటీ కేసు నమోదు అయింది.

15.నేడు హైదరాబాద్ కు కర్ణాటక డిప్యూటీ సీఎం

Telugu Ap, Ceo Vikas Raj, Chandrababu, Congress, Jagan, Janasena, Janasenani, Ka

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ నేడు హైదరాబాద్ కు  రానున్నారు.

16.నేడు రేపు పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్వో లు

ఏపీలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద శని ఆదివారాలు బిఎల్వోలు అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమం చేపట్టింది.

17.జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్

Telugu Ap, Ceo Vikas Raj, Chandrababu, Congress, Jagan, Janasena, Janasenani, Ka

వైసీపీ నేతలకు దమ్ముంటే తన ఇంటి వద్దకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.

18.హైదరాబాద్ కు ఏఐసిసి అగ్ర నేతలు

రేపు హైదరాబాద్ కు ఏఐసిసి అగ్రనేతలు తెలంగాణ ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో వారు తెలంగాణకు రానున్నారు.

19.మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు

Telugu Ap, Ceo Vikas Raj, Chandrababu, Congress, Jagan, Janasena, Janasenani, Ka

మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పు చేసింది డిసెంబర్ మూడుకు బదులుగా నాలుగున కౌంటింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది.

20.నారా లోకేష్ విమర్శలు

కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో బహిరంగ సభలో మాట్లాడిన లోకేష్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు .చంద్రబాబును చూసినా,  పవన్ ని చూసినా, జగన్ కు భయమేస్తోందని , చివరికి చెల్లిని చూసినా, ప్రజలను చూసిన జగన్ కి భయం కలుగుతుందని లోకేష్ విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube