వర్క్ ఫ్రమ్ హోం చేసేవారికి క్యాన్సర్ ముప్పు.. జాగ్రత్తగా ఉండాల్సిందే!

కరోనా అనేక మార్పులను తీసుకొచ్చింది.మానవుని జీవనశైలితో పాటు అన్ని రంగాల్లోనూ కొత్త మార్పులు వచ్చాయి.

 Those Who Work From Home Are At Risk Of Cancer.. Be Careful! , Employees, Work F-TeluguStop.com

గతానికి భిన్నంగా పూర్తిగా పద్దతులు మారిపోయాయి.కరోనా వల్ల కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని తీసుకొచ్చాయి.

గతంలో వర్క్ ఫ్రమ్ హోం విధానం చాలా తక్కువగా ఉండేది.పార్ట్‌టైమ్, ఫ్రీలాన్స్ లాంటి జాబులకు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోం ఉండేది.

కానీ కరోనాతో వర్క్ ఫ్రం హోం అనేది బాగా పాపులర్ అయింది.

కంపెనీలన్నీ కరోనా ప్రభావంతో వర్క్ ఫ్రం హోం( Work from home ) బాట పట్టాయి.

ఇప్పటికీ అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి.మరికొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్‌ను ప్రవేశపెట్టాయి.అంటే నెలలో కొన్ని రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది.మిగతా రోజు వర్క్ ఫ్రం హోం చేయాల్సి ఉంటుంది.

అయితే వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని, దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అంతేకాదు క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు కూడా వచ్చే అవకాశముందట.

Telugu Corona, Employees, Exercise, Pain, Ovarian, Prostate Cancer, Cancer-Lates

వర్క్ ఫ్రం హోంలో ఒకేచోట కూర్చోని ఉద్యోగం చేస్తారు.దీని వల్ల అండాశయ( Endometrial cancer ), ప్రొస్టేట్ క్యాన్సర్‌తో పాటు కొలోరెక్టర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్లు వచ్చే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.అలాగే జంక్ ఫుడ్, కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని చెబుతున్నారు.అలాగే వర్క్ ఫ్రం హోం చేసేవాళ్లు ఇంట్లో కూర్చోని వ్యాయామం( exercise ) లాంటివి చేయరు.

Telugu Corona, Employees, Exercise, Pain, Ovarian, Prostate Cancer, Cancer-Lates

దీంతో శరీరంలో కొవ్వు చేరి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.అలాగే షుగర్ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు.అలాగే వర్క్ ఫ్రమ్ హోం చేసేవారికి కీళ్ల సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube