టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు బ్లాక్ బస్టర్ కాంబినేషన్లుగా పేరును సొంతం చేసుకున్నాయి.బాలయ్య బోయపాటి కాంబో, వెంకటేశ్ అనిల్ రావిపూడి (Balayya Boyapati combo, Venkatesh Anil Ravipudi)కాంబోలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశ పరచలేదని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
అయితే వెంకీ అనిల్ కాంబో మూవీ సంక్రాంతికి వస్తున్నాం (sankranthiki vasthunnam )బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొడుతోందని చెప్పాలి.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి హిట్ గా నిలవడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకుంది.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ రేంజ్ లో హిట్ కావడం వెనుక అసలు కారణాలు ఏంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి.కథ మరీ కొత్తగా లేకపోయినా కథనం మరీ అద్భుతమని టాక్ రాకపోయినా సంక్రాంతి సినిమాలలో ఇతర సినిమాలతో పోల్చి చూస్తే బెటర్ సినిమా కావడం ఈ సినిమాకు కలిసొచ్చింది.
సాధారణంగా సంక్రాంతి పండుగ కానుకగా ఫ్యామిలీ సినిమాలను రిలీజ్ చేస్తే కచ్చితంగా సక్సెస్ దక్కుతుందని నిర్మాత దిల్ రాజు భావిస్తారు(Producer Dil Raju thinks).ఈ సినిమా ఆ సెంటిమెంట్ ను సైతం నిజం చేస్తూ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిందనే చెప్పాలి.సంక్రాంతికి వస్తున్నాం 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది.వెంకటేశ్ కెరీర్ లో ఇప్పటివరకు ఈ రేంజ్ హిట్ లేదు.
ఫ్యామిలీ సబ్జెక్ట్ లో నటించిన ప్రతి సందర్భంలో వెంకటేశ్ కు బ్లాక్ బస్టర్ హిట్ దక్కగా ఈ సినిమా ఆ సెంటిమెంట్ ను మరీసారి ప్రూవ్ చేసింది.పాటలు హిట్ కావడం, ఇతర సినిమాలతో పోల్చి చూస్తే టికెట్ రేట్లు తక్కువగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.