తాత ఎన్టీఆర్ తరఫున వందల కోట్ల ఆస్తి తనకు వారసత్వంగా వచ్చిన ఏ రోజు కూడా వాటి గురించి అతడు ఆశించలేదు.అందుకే తారకరత్న కన్ను మూసినా కూడా ఈరోజు అందరిలో హీరోగా నిలబడ్డాడు.
ప్రేమించిన భార్య చెయ్యి వదలకుండా కడవరకు ఆమె చేతిలో చెయ్యి వేసే ఉన్నాడు.తారక రత్న కన్నుమూసిన క్షణం నుంచి అలేఖ్య ఒంటరి అయిపోయింది.
ప్రస్తుతం తీవ్రమైన శోకంలో కుమిలిపోతుంది ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ అందరిలో ఆశ్చర్యంతో పాటు కాస్త షాక్ ని కూడా మిగిలిస్తోంది.కార్లలో నిద్రపోయిన రాత్రుల నుంచి నేటి వరకు తమ కలిసే ఉన్నాము అంటూ అమ్మ పెట్టిన పోస్ట్ అందరిని భావోద్వేగాలకు గురిచేస్తుంది.
ఇక తారకరత్న చనిపోయిన క్షణం నుంచి అందరూ వారి కుటుంబంలో జరిగిన గొడవల గురించి మాట్లాడుతున్నారు.ఇంత కఠినంగా ఒక తండ్రి గుండె ఎందుకు మారిపోయింది అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు కొడుకు చావుతో పోరాడుతుంటే తారక రత్న తండ్రి ఆసుపత్రికి రాలేదు.
చివరికి శవం గా మోకిలాలో పడి ఉంటే చూడటానికి రాలేదు.ఫిలిం చాంబర్ కి అందరూ నిందిస్తుంటే కనిపించి అంత్యక్రియలు మాత్రం జరిపించి వెళ్లిపోయారు.ఇక చిన్న కర్మ, పెద్దకర్మ అంతా బాలయ్య హడావిడితోనే కనిపిస్తోంది.తండ్రి, తాతల నుంచి సంక్రమించిన వందల కోట్ల ఆస్తులలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు తారకరత్న.
తాను కష్టపడి కొనుక్కున్న మోకిలా ఇంటిలోనే చివరి వరకు జీవించాడు.చాలా కుటుంబాల్లో కులాంతర మతాంతర వివాహాలు జరుగుతున్నాయి.కానీ తారక రత్న ప్రేమను కేవలం రాజకీయ కారణాలతో ఒప్పుకోలేదు.ఎన్టీఆర్ కి దీటుగా ఏకంగా గిన్నిస్ రికార్డ్ మూవీ ఓపెనింగ్స్ చేసిన తర్వాత తర్వాత కుటుంబం సపోర్ట్ లేకపోవడం తో అవి విడుదలకు నోచుకోలేదు.
పైగా కూతురు రూప పెళ్లికి కొడుక్కు కార్డ్ కుడ్ ఇవ్వండి తండ్రి గా తారక రత్న తండ్రి చరిత్రలో నిలిచిపోయాడు.ఇప్పుడు పెద్ద కర్మ కూడా బాలయ్య బాబు నిర్వహిస్తూ ఇన్విటేషన్ కార్డ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది.ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ, పెళ్లి వల్ల కుటుంబం, అస్తి, కెరీర్ కూడా పోగొట్టుకొని నేడు అందరి హృదయాల్లో మాత్రమే మిగిలాడు తారక రత్న