రక్తహీనత( anemia ) అనేది ప్రస్తుత రోజుల్లో ఎంతో మందిని వేధిస్తున్న సమస్య.పిల్లల నుంచి పెద్దల వరకు కోట్లాది మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
రక్తహీనతకు ఐరన్ లోపం అనేది ప్రధాన కారణం.కాబట్టి రక్తహీనత నుంచి బయట పడాలంటే శరీరానికి కావలసిన ఐరన్ ను భర్తీ చేయాల్సి ఉంటుంది.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ గ్రేట్ గా తోడ్పడుతుంది.పైగా ప్రస్తుత వేసవి కాలంలో తీసుకోవడానికి కూడా ఈ జ్యూస్ ఎంతో అనుగుణంగా ఉంటుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం రక్తహీనతను దూరం చేసే ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న బీట్ రూట్ ( Beet root )ను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు( Watermelon slices ) వేసుకోవాలి.అలాగే అరకప్పు పీల్ తొలగించి సన్నగా తరిగిన బీట్ రూట్ ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము( Grate ginger ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని కొద్దిగా నిమ్మరసం కలిపి సేవించాలి.

ప్రస్తుత వేసవి కాలంలో ఈ పుచ్చకాయ బీట్ రూట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా నిత్యం ఈ జ్యూస్ ను తీసుకుంటే ఐరన్ కొరత దూరమై రక్తహీనత నుంచి బయటపడతారు.అలాగే సమ్మర్ లో ఈ జ్యూస్ బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ను ఇస్తుంది.
శరీరంలో అధిక వేడిని తొలగిస్తుంది.డీహైడ్రేషన్( Dehydration ) బారిన పడకుండా రక్షిస్తుంది.

అంతేకాకుండా మూత్రపిండాల ఆరోగ్యానికి ఈ పుచ్చకాయ బీట్ రూట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ జ్యూస్ టాక్సిన్స్ ను తొలగించి కిడ్నీలను శుభ్రంగా మారుస్తుంది.మీ కిడ్నీలు ఆరోగ్యంగా మరియు బాగా పనిచేయాలంటే పుచ్చకాయ బీట్ రూట్ జ్యూస్ ను తప్పకుండా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.







