అక్కినేని నాగచైతన్య( Akkineni Nagachaitanya ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్( Thandel ).ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.
ఇక ఇటీవల ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసింది.అయితే తాజాగా తమిళ ట్రైలర్ కూడా చెన్నైలో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తమిళ స్టార్ హీరో కార్తీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ చిత్రాన్ని తమిళంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సాయి పల్లవి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సాయి పల్లవి ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.మా చిత్ర బృందాన్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తెలియజేశారు.ఈ సినిమా గురించి ఈమె మాట్లాడుతూ ముందుగా ఈ సినిమా కథను ఒక రియల్ స్టోరీగా చెప్పారు.
అనంతరం దానిని ఒక అందమైన ప్రేమకథగా మార్చారని సాయి పల్లవి తెలిపారు.ఈ ప్రయాణానికి మూడేళ్ల సమయం పట్టిందని తెలిపారు.

చైతన్య అద్భుతంగా తన పాత్రలో ఒదిగిపోయి ప్రాణం పెట్టి నటించారు.దేవిశ్రీగారు అందమైన పాటలను ఇచ్చారు.సినిమా రిలీజ్‌కు ముందే ఆడియెన్స్ పాటలను పెద్ద హిట్ చేస్తూ మా అందరికీ ఒక సరికొత్త ఎనర్జీని ఇచ్చారని సాయి పల్లవి తెలిపారు.ఇక అల్లు అరవింద్( Allu Aravind ) గారి గురించి కూడా ఎంతో గొప్పగా మాట్లాడారు తనకు సినిమా షూటింగ్ సమయంలో ఏ కొంచెం ఇబ్బంది కూడా లేకుండా అల్లు అరవింద్ గారు చూసుకున్నారని ఆయన నాకు తండ్రి సమానులు అంటూ సాయి పల్లవి తెలిపారు.
గతంలో కూడా సాయి పల్లవి గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ… నాకు కూతురు లేదు కూతురే కనుక ఉంటే సాయి పల్లవి లాగా ఉండాలని కోరుకుంటాను ఆమె నా కూతురితో సమానం అంటూ అల్లు అరవింద్ కూడా సాయి పల్లవి గురించి గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.