అధిక హెయిర్ ఫాల్( Hairfall ) కారణంగా కొందరి జుట్టు అనేది చాలా పల్చగా మారిపోతూ ఉంటుంది.ఆడవారే కాదు ఎందరో మగవారు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే పల్చటి జుట్టును( Thin Hair ) దట్టంగా మార్చుకునేందుకు రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు.మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ రెమెడీని పాటిస్తే కొద్ది రోజుల్లోనే దట్టమైన కురులు మీ సొంతం అవుతాయి.

అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకుని( Aloevera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక ఉల్లిపాయను( Onion ) కూడా పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న కలబంద, ఉల్లిపాయ వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు( Curd ) మరియు వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటించారంటే అదిరిపోయే రిజల్ట్ మీ సొంతమవుతుంది.కలబంద, ఉల్లి, నువ్వుల నూనె, పెరుగు కాంబినేషన్ జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణను అందిస్తుంది.
జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.అలాగే ఈ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య క్రమంగా దూరమవుతుంది.
కురులు దట్టంగా పెరగడం ప్రారంభమవుతుంది.పైగా కలబంద, ఉల్లి, నువ్వుల నూనె, పెరుగు.
ఇవి స్కాల్ప్ ను హైడ్రేట్ గా ఉంచుతాయి.చుండ్రు సమస్యను సైతం దూరం చేస్తాయి.