సాధారణంగా ఒక్కోసారి నీరసం కుమ్మేస్తుంటుంది.ఏ పని చేయలేకపోతూ ఉంటారు.
నిలబడాలన్న కాసేపు నడవాలన్నా కూడా ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు.అయితే అలాంటి వారికి బలాన్ని ఇచ్చే స్మూతీ ఒకటి ఉంది.
అదే బనానా స్మూతీ( Banana smoothie ).ఈ స్మూతీని వారానికి కనీసం ఒక్కసారి తీసుకున్న బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.
అందుకోసం ముందుగా ఒక అరటిపండు తీసుకుని తొక్క తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకుని గంటపాటు ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో అరటిపండు స్లైసెస్, రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకోవాలి .వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజలు, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి మరియు ఒక గ్లాసు ఫ్రెష్ హోమ్ మేడ్ బాదం పాలు( Almond milk ) పోసి మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మన బనానా స్మూతీ అనేది రెడీ అవుతుంది.
ఈ స్మూతీ చాలా రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ఈ బనానా స్మూతీ అనేక రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్ తదితర పోషకాలతో నిండి ఉంటుంది.డైట్ లో ఈ స్మూతీని చేర్చుకుంటే ఎలాంటి నీరసం అయినా పరారవుతుంది.
ఒంటికి వెయ్యి ఏనుగుల బలం చేకూరుతుంది.ఫుల్ ఎనర్జిటిక్ గా మారతారు.
అంతేకాదు ఈ బనానా స్మూతీ ఎముకలు కండరాల దృఢత్వానికి మద్దతు ఇస్తుంది.అతి ఆకలిని దూరం చేసి ఎక్కువ సమయం పాటు కడుపుని నిండుగా ఉంచుతుంది.
అధిక రక్తపోటుకు చెక్ పెడుతుంది.ఈ బనానా స్మూతీలో మెండుగా ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరును పెంచుతుంది.
మలబద్ధకాన్ని నివారిస్తుంది.ఈ బనానా స్మూతీ తలనొప్పి మరియు హ్యాంగోవర్ నుంచి రిలీఫ్ పొందడానికి సహాయపడుతుంది.
ఐరన్ మరియు బి6 అధికంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు కూడా ఈ స్మూతీని ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.