కేజిఎఫ్ 2 ఫేం యశ్ కు నెక్స్ట్ సినిమా కత్తిమీద సాము లాంటిది?

సౌత్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ లుగా కొనసాగుతున్న అందరికీ ఒకే ఒక్క సినిమాతో షాక్ ఇచ్చాడు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.ఇప్పటి వరకు ప్రశాంత్ కెరీర్ లో ఉన్నది మూడు సినిమాలు కావడం గమనార్హం.

 Hero Yash Problems After Kgf Movies , Hero Yash , Kgf , Director Prashant Neel-TeluguStop.com

అయినా తన స్థాయి పాన్ ఇండియా లెవెల్ కు చేరుకుంది.తీసిన మూడు సినిమాలలో రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీస్.

మోడైట్ సినిమా కన్నడలో వచ్చిన ఉగ్రం కాగా, రెండవ సినిమాకే తన ఆలోచనలు పెద్దవిగా అయ్యాయి.కన్నడలో అప్పటి వరకు సరైన బ్రేక్ లేని సాధారణ హీరో యశ్ ని ప్రధాన పాత్రలో నటింపచేసి ప్రపంచానికి తన సత్తా ఏమిటో చూపించాడు.

 Hero Yash Problems After Kgf Movies , Hero Yash , Kgf , Director Prashant Neel-TeluguStop.com

ఒక యదార్ధ కథను ఆధారంగా తీసుకుని దాని చుటూ కథను అద్భుతంగా అల్లాడు.ఆ సినిమానే కేజీఎఫ్ చాప్టర్ 1 , ఈ సినిమాలో హీరో గా చేసిన యశ్ కి ఇప్పుడు ఒక రేంజ్ లో స్టార్ డం వచ్చేసింది.

అయితే యశ్ కి ఇంతటి గుర్తింపును తీసుకురావడంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ది ప్రత్యేకమైన పాత్ర.ముఖ్యంగా గత వారమే రిలీజ్ అయిన కెజిఎఫ్ చాప్టర్ 2 లో యశ్ ఇంట్రడక్షన్ సీన్ నుండి సముద్రంలో షిప్ సీన్ వరకు ప్రతి ఒక్కటి అద్భుతంగా వచ్చింది.

ముఖ్యంగా యశ్ తో తీసిన సీన్ లలో ఎలివేషన్ లు ఒక రేంజ్ లో ఉన్నాయని పెద్ద పెద్ద డైరెక్టర్ లు ముక్కున వేలేసుకుంటున్నారు.కేవలం రెండు సినిమాలకే హీరో యశ్ కు ఏ హీరోకు రానంత మంచి పేరు వచ్చింది.ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.ఈ సినిమాకు అన్నా ముందు రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ కు మించిన విజయాన్ని కే జి ఎఫ్ చాప్టర్ 2 అందుకోవడంతో యశ్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

దీని వలన యశ్ నుండి వచ్చే తర్వాత సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటారు.

అయితే ఇప్పుడు హీరో యశ్ కి వచ్చిన మంచి పేరు భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి.ఎందుకంటే ఒక్కసారి ప్రేక్షకుల దృష్టిలో గొప్ప హీరోగా పేరు వస్తే, ఇక అదే స్థాయిలో తన నుండి సినిమాలను ఆశిస్తారు.కానీ ప్రస్తుతం సౌత్ లో ఉన్న డైరెక్టర్ లను చూస్తే ఇప్పుడల్లా యశ్ తో ఆ స్థాయి సినిమాలను తీసే డైరెక్టర్ లు లేరనే చెప్పాలి.

ఇక ఎంత కాలం అయినా మళ్లీ ప్రశాంత్ నీల్ మాత్రమే యశ్ తో సినిమా తీయాలి.కాగా ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్, ఎన్టీఆర్ ల మూవీ లతో బిజీగా ఉన్నారు.

ఇక అవకాశం ఉన్న డైరెక్టర్ లు త్రివిక్రమ్, కొరటాల శివ, రాజమౌళి లాంటి వారు ఇప్పటికే భవిష్యత్తు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టారు.కాబట్టి ఇప్పుడు వచ్చిన సక్సెస్ ను కంటిన్యూ చేయడం యశ్ కు కత్తి మీద సాము లాంటిది.

దీనితో నెటిజన్లు ఇప్పుడు సక్సెస్ వచ్చిందని పండుగ చేసుకోవడం కాదు… యశ్ కు ముందుంది ముసళ్ల పండుగ అంటూ ట్రొల్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube