తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.రాబోయే ఎన్నికల నాటికి మరింత బలం పెంచుకుని అధికారంలోకి రావాలని చూస్తోంది.
పూర్తిగా దృష్టి మొత్తం ఏపీ పైన పెట్టారు.టీడీపీ అధినేత చంద్రబాబు , ఆ పార్టీ నాయకులంతా ఏపీలో అధికారంలోకి వచ్చే విషయంపై దృష్టి పెట్టి తగిన వ్యూహాలను రచిస్తున్నారు.
నిరంతరం ఏపీ రాజకీయాలపైనే దృష్టి సారించారు.దీంతో తెలంగాణ రాజకీయాల వైపు చంద్రబాబు పెద్దగా దృష్టి సారించింది లేదు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత టిడిపి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న, ఇప్పుడు మాత్రం పూర్తిగా కనుమరుగైనట్టుగానే ఉంది. తెలంగాణ టిడిపి లో ఉన్న కీలక నాయకులంతా ఇతర పార్టీలలో చేరిపోయారు.
దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్న లేనట్టుగానే ఉంది.అప్పుడప్పుడు చంద్రబాబు మాత్రమే పార్టీ నాయకులతో సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ భవన్ లో తాజాగా తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు పార్టీ నాయకుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.తెలంగాణ తెలుగు దేశాన్ని మరింత యాక్టివ్ చేసేందుకు అందరం ప్రయత్నిద్దామని , పార్టీ తరఫున వివిధ కార్యక్రమాలను చేపడుతూ ముందుకు వెళ్దాము అంటూ ప్రకటించారు.
ఈ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పేరుకే ఉంది తప్ప, ఆ పార్టీలో బలమైన నాయకులు ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్న తలెత్తుతోంది, ఇప్పుడు ప్రధాన పోటీ అంతా, బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నెలకొంది.

ఈ క్రమంలో మరోసారి తెలంగాణలో తెలుగుదేశాన్ని యాక్టీవ్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుండటం , తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాగలమ అనే ధీమాను వ్యక్తం చేస్తుండడం సొంత పార్టీ నేతలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.అయితే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే సంగతి పక్కన పెడితే, రాబోయే ఎన్నికల నాటికి టిడిపి ఓటు బ్యాంకు ను ఏదో ఒక జాతీయ పార్టీకి డైవర్ట్ చేసేందుకు ఈ విధంగా మాట్లాడారా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.