గ్యాప్ లేకుండా ముఖం మొత్తం మచ్చలతో నిండిపోయిందా.? వాటిని వదిలించుకునేందుకు ముప్పతిప్పలు పడుతున్నారా.? మార్కెట్లో లభ్యమయ్యే క్రీమ్, సీరం లను కొనుగోలు చేసి వాడిన సరే ఎలాంటి ఫలితం కనిపించడం లేదా.? అయితే చింతించకండి.మీకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.ఈ చిట్కాను పాటిస్తే ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే ఇరవై రోజుల్లోనే మాయం అవ్వడం ప్రారంభమవుతుంది.
మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓ లుక్కేసేయండి.
ముందుగా రెండు టేబుల్ స్పూన్ల పెరుగు( curd ) పల్చటి వస్త్రంలో వేసి అందులో ఉండే నీరు ను తొలగించాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నీరు తొలగించిన పెరుగును వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ) ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood powder ), వన్ టేబుల్ స్పూన్ వేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ తొక్కల పొడి వేసుకోవాలి.
చివరిగా పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ మరియు నాలుగు టేబుల్ స్పూన్లు టమాటో జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా మరోసారి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ఏదైనా బ్రష్ సహాయంతో కాస్త మందంగా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
రెగ్యులర్ గా ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా తగ్గుముఖం పడతాయి.కొద్ది రోజుల్లోనే క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
అలాగే ఈ సింపుల్ చిట్కాను పాటించడం వల్ల ముఖ చర్మం తెల్లగా కాంతివంతంగా ఆకర్షణీయంగా మారుతుంది.మొటిమలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ముఖంపై మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి.చర్మం ఆరోగ్యంగా మరియు యవ్వనంగా మెరుస్తుంది.కాబట్టి తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను డైలీ రొటీన్ లో భాగంగా చేసుకోండి.