మనలో చాలా మందికి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో కనిపించే ఐటెం ఇడ్లీ.అయితే ఇడ్లీ తయారీలో తెల్ల బియ్యం ఎక్కువగా ఉపయోగిస్తే.
అందులో అధిక మొత్తంలో ఉండే కార్బోహైడ్రేట్లు వెయిడ్ గెయిన్ కు కారణం అవుతాయి.అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
అందుకే ఇకపై రాగి ఇడ్లీని( Ragi Idli ) డైట్ లో చేర్చుకోండి.రాగి ఇడ్లీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అన్ని వయస్సుల వారికి తేలికగా జీర్ణమవుతుంది.మరియు పోషకాహార పరంగా సమృద్ధిగా ఉండే రాగి ఇడ్లీని తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య లాభాలను పొందవచ్చు.
రాగి కాల్షియం సమృద్ధిగా ఉండే ధాన్యం.అందువల్ల బ్రేక్ ఫాస్ట్ లో( Breakfast ) రాగి ఇడ్లీని తీసుకుంటే.ఎముకల దృఢంగా మారతాయి.చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వయోజనులకు రాగి ఇడ్లీ మంచి ఆహార ఎంపిక అవుతుంది.
అలాగే మధుమేహం( Diabetes ) ఉన్నవారు రాగి ఇడ్లీని తినొచ్చు.ఎందుకంటే, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రాగి ఇడ్లీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్‌తో ఉండే టిఫిన్స్ లో రాగి ఇడ్లీ ఒకటి.అందువల్ల బరువు తగ్గాలని( Weight Loss ) ప్రయత్నిస్తున్నవారు రాగి ఇడ్లీని డైట్ లో చేర్చుకోవడం ఎంతో మేలు.రాగి ఇడ్లీ పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది.ఆకలి లేకుండా చేస్తుంది.వెయిట్ లాస్ ను ప్రోత్సహిస్తుంది.అలాగే రాగి ఇడ్లీలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.ఇది గుండె సంబంధిత సమస్యలను తగ్గించేందుకు తోడ్పడుతుంది.

రాగి ఇడ్లీలో పుష్కలంగా ఉండే ఐరన్ శరీరంలో హీమోగ్లోబిన్ పెంపొందించి రక్తహీనతను తరిమికొడుతుంది.అంతేకాదండోయ్.రాగి ఇడ్లీలో ఉండే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ శరీరానికి బలాన్ని అందిస్తాయి.
రోజంతా ఎనర్జిటిక్ గా ఉండేందుకు సహాయపడతాయి.జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రొబయోటిక్స్ కూడా కలిగి ఉండటం వల్ల రాగి ఇడ్లీ కొలన్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.