తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క అపజయం కూడా లేనటువంటి దర్శకులలో రాజమౌళి( Rajamouli ) ఒకరు.ఆయన తర్వాత ఇలాంటి క్రెడిట్ ఎవరికైనా దక్కుతుందా అంటే అది డైరెక్టర్ అనిల్ రావిపూడి( Director Anil Ravipudi ) అని చెప్పాలి.
అనిల్ రావిపూడి రచయితగా ఇండస్ట్రీలో కొనసాగారు అయితే రచయితగా తనకు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఈయన దర్శకుడిగా మారారు ఇలా 10 సంవత్సరాల సినీ కెరియర్ లో 8 సినిమాలకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి ఎనిమిది సినిమాల ద్వారా హిట్ కొట్టారు.ఈయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ కావడంతో ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఈయనతో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇటీవల వెంకటేష్( Venkatesh ) హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకునే సుమారు 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి వరుస ఫ్లాపులలో చిక్కుకున్న నిర్మాత దిల్ రాజుకు( Dil Raju ) ఎంతో ఉపశమనం కలిగించారు దీంతో చిత్ర బృందం అనిల్ రావిపూడి పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక ఎప్పుడూ కూడా ఎక్కడ మాట్లాడని దిల్ రాజు తమ్ముడు శిరీష్( Shireesh ) సైతం అనిల్ రావిపూడి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.

ఇలా తన గురించి అందరూ ప్రశంసలు కురిపిస్తున్న అనిల్ రావిపూడికి మాత్రం ఓ వెలితి అలాగే ఉందని ఇండస్ట్రీలో తనకు దక్కాల్సిన గౌరవం( Respect ) దక్కలేదు అంటూ బాధపడ్డారు.ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.ఇన్ని విజయాలు,రికార్డులు, ప్రశంసలు దక్కినప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమలోనూ, మీడియాలోనూ, క్రిటిక్స్ సర్కిల్స్‌లోనూ నాకు దక్కల్సిన రెస్పెక్ట్ దక్కడంలేదు.కానీ కొందరు దర్శకులకు చిన్న విషయానికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో పెద్ద ఎలివేషన్ వారికి దక్కుతుంది కానీ ఇంత సాధించిన నాకు మాత్రం దక్కడం లేదు అయినా ఈ విషయంలో నాకు బాధ లేదు ఎందుకంటే ప్రేక్షకులు నన్ను నా సినిమాలను ఎంతగానో ఆదరిస్తున్నారు.
నాకు అంతే చాలు.భవిష్యత్తులో నైనా ఆ వర్గాలు నన్ను యాక్సెప్ట్ చేస్తారేమో చూద్దాం అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతాయి.