శేఖర్ కమ్ముల(sekhar kammula ) దర్శకత్వంలో హీరో ధనుష్ నాగార్జున అలాగే రష్మిక మందన(Hero Dhanush, Nagarjuna, Rashmika Mandanna) కలిసి నటిస్తున్న చిత్రం కుబేర.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల( director sekhar kammula) ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.కుబేర (Kuberaసినిమా కథ సిద్ధమైంది.
బిచ్చగాడి పాత్ర గురించి ధనుష్‌కు ఎలా చెప్పాలా?అని కాస్త సంకోచించా! ఎందుకంటే అసలు నేను ఆయనకు తెలుసో లేదోనన్న అనుమానం కూడా నన్ను వెంటాడింది.

నేను ఆయనకు ఫోన్ చేయగానే, ధనుష్ నన్ను ఆశ్చర్యపరిచారు.నేను తీసిన వాటిలో ఆయన ఫేవరెట్ మూవీలు, అందులోని సన్నివేశాల గురించి మాట్లాడటం మొదలు పెట్టారు.ధనుష్ లాంటి నటుడితో పనిచేయడం సంతోషంగా ఉంది అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.
ఇకపోతే డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ గా నిలిచిన విషయం తెలిసిందే.దీంతో ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని చెబుతున్నారు.
మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి మరి.

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం రష్మిక వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుస హిట్ లను అందుకుంటుంది.
ఇటీవల యానిమల్, పుష్ప 2 లాంటి సినిమాలతో రెండు బ్లాక్ బాస్టర్ హిట్ లను అందుకున్న విషయం తెలిసిందే.తెలుగు తమిళం హిందీ అనే భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుందో దూసుకుపోతోంది రష్మిక మందన.
ఈ సినిమా మరి రష్మికకు ఎలాంటి సక్సెస్ ను తెచ్చి పెడుతుందో చూడాలి మరి.