సీనియర్ ఎన్టీఆర్.. అప్పట్లో ఇంటి రెంట్ ఎంత కట్టేవారో తెలుసా?

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి ఎన్టీ రామారావు బౌతికంగా మనకు దూరమై ఏళ్లు గడుస్తున్నా.అయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలి పోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 Sr Ntr Expenditure In His Early Days , Sr Ntr, Gummadi Venkateswara Rao, Nadend-TeluguStop.com

ఎందుకంటే ఒక నటుడిగా ఆయన ఎంత గుర్తింపు సంపాదించుకున్నాడో.ఒక రాజకీయ నాయకుడిగా కూడా అంతకు మించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.

నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన రాజకీయ నాయకుడిగా ఒక గొప్ప వ్యక్తిగా అందరి గుండెల్లో గుడి కట్టుకున్నారు అన్న చెప్పాలి.

ఆయన సినిమా రంగంలో నిలదొక్కుకోవడామే కాదు స్నేహితులను సైతం సినిమారంగంలో నిలదొక్కుకునేలా చేశారు.

ఇక ఎన్టీఆర్ కెరీర్ లో తొలి నాళ్లలో విజయా సంస్థలో హీరో గా పనిచేశారు.ఇక ఆయనకు నెలకు 500 రూపాయల వరకు శాలరీ ఇస్తూ ఉండేవారు.

ఇది కాకుండా సినిమా హిట్ అయితే ఐదు వేల రూపాయల వరకు పొందేవారు.మిగతా హీరోలు మాత్రం ఆ సమయంలో కేవలం రెండు నుంచి మూడు వందల రూపాయలు మాత్రమే నెలకు సంపాదించే వారు.

రాబడి ఎంత ఉన్నా ఖర్చు విషయంలో మాత్రం అన్నగారు కాస్త జాగ్రత్తగానే ఉండేవారట.

Telugu Expenditure, Sr Ntr, Srntr, Tollywood-Telugu Stop Exclusive Top Stories

ఎన్టీఆర్ స్నేహితుడు గుమ్మడి వెంకటేశ్వరరావు స్వయంగా రాసుకున్న తీపి గుర్తులు చేదు జ్ఞాపకాలు పుస్తకంలో అన్న గారి గురించి ఎన్నో విషయాలను ప్రస్తావించారు.200 రూపాయలు సంపాదించి 400 రూపాయలు ఖర్చు చేసే నన్ను అన్నగారు ఎప్పుడు నన్ను మందలిస్తూ ఉండేవారు.ఆదాయంలో ఖర్చులు ఉండాలి తప్ప అప్పులు చేసి ఇబ్బందులు పడకూడదనీ చెప్పేవారు.

నెలకు 500 సంపాదించి వంద రూపాయలు ఖర్చు పెట్టే వారు ఎన్టీఆర్.రెంటుకు ₹50 నెలకు అయ్యే క్యారేజి భోజనం 25 టీ కాఫీ ఖర్చులకు 25 రూపాయలు మాత్రమే ఖర్చు చేసి మిగతా మొత్తాన్ని ఇంటికి పంపించేవారు అంటూ గుమ్మడి వెంకటేశ్వరరావు తాను రాసిన పుస్తకంలో ప్రస్తావించాడు.

అయితే ఇది నాణానికి ఒక వైపు, అయన తొలినాళ్లలో ఎంతో వినయంగా, విధేయతతో ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత కాలంలో షూటింగ్ లొకేషన్స్ లో ఉన్న టవల్స్, ఫుడ్ ని అన్ని ఫ్రీ గా వాడుకునే వారని, అయన పరమ పిసినారి కానీ ఎవరికి ఒక్క రూపాయి కూడా దానం చేయదు అని, ఏకంగా దేవుడి దగ్గర ఉన్న పళ్ళను కూడా వదలడు అంటూ అయన రాజకీయా శత్రువు అయినా నాదెండ్ల భాస్కర్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube