నాకు రాజకీయాలు తెలియవు.. ‘మా’ని నేను కోరేది అదొక్కటే.. పూనమ్ కామెంట్స్ వైరల్!

పూనమ్ కౌర్(Poonam kaur).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Poonam Kaur I Donot Know Politics I Just Want Maa To Help Me, Poonam Kaur, Polit-TeluguStop.com

ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా పాపులర్ అయిన విషయం తెలిసిందే.అటు సినిమాలకు సంబంధించిన వ్యవహారంలో ఇటు రాజకీయాలకు(politics) సంబంధించిన వ్యవహారంలో తరచుగా సంచలన ట్వీట్లు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

సంబంధం లేని వ్యవహారాలలో కూడా తరచూ లేనిపోని కాంట్రవర్సీలను కొనితెచ్చుకుంటూ ఉంటుంది.ఎక్కువగా ఆమె పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

ఇటీవల కాలంలో ఆమె మా అసోసియేషన్ గురించి చేస్తున్న ట్వీట్లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.మా అసోసియేషన్(Maa Association) గురించే ఆమె ఎక్కువగా స్పందిస్తూ ట్వీట్లు చేస్తోంది.

అందులో భాగంగానే ఇటీవల ట్విట్టర్ వేదికగా చేసిన కొన్ని ట్వీట్స్ వైరల్ అయ్యాయి.

Telugu Maa, Poonam, Poonam Kaur, Tollywood-Movie

ముఖ్యంగా మా అసోసియేషన్ కు సంబంధించి ఆమె చేసిన కొన్ని ట్వీట్స్ (Tweets)ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి.ఈ క్రమంలో ఆమె మా నుండి తను ఏం కోరుకుంటుంది అన్న విషయం గురించి ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.ఈ సందర్భంగా పూనమ్ కౌర్ మాట్లాడుతూ.

ప్రస్తుతం వర్క్ చేసేందుకు రెడీగా ఉన్నాను.చాలా మంది అప్రోచ్ అవుతున్నారు.

మంచి అవకాశాలు వస్తున్నాయి.కొన్నాళ్లుగా నేను ఫైబ్రోమైయాల్జీయాతో (fibromyalgia)బాధపడుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం దాని నుండి నేను కోలుకుంటున్నాను.మళ్లీ వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను.

చిన్న చిన్న క్రాఫ్ట్‌ లపై వర్క్ చేయాలని అనుకుంటున్నాను.కాకపోతే పని చేసే ముందు మన హెల్త్ బాగుండాలని కోరుకున్నాను.

ఇంతకుముందు కంటే ఇప్పుడు నా హెల్త్ బాగానే ఉంది.అందుకే వర్క్ చేసేందుకు సిద్ధమయ్యాను.

Telugu Maa, Poonam, Poonam Kaur, Tollywood-Movie

త్వరలోనే నేను చేసేవి అందరికీ తెలుస్తాయి.మా విషయానికి వస్తే.నేను మా అసోసియేషన్‌కు(maa association) ఫిర్యాదు చేయడం జరిగింది.ఝాన్సీ(Jhansi) గారికి కూడా ఫిర్యాదు చేశాను.చాలా రోజుల నుండి చాలా రకాలుగా నా గురించి మాట్లాడుతున్నారు.ఆ టైమ్‌ లో నేను సైలెంట్‌ గా ఉన్నాను.

నాకు పాలిటిక్స్ తెలియవు.నేను వచ్చి మాట్లాడితే అటెన్షన్ కోసం చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు.

అందుకే చాలా గౌరవనీయమైన సంస్థ కాబట్టి మా అసోసియేషన్ స్టేట్‌మెంట్ ఇస్తే బాగుంటుందని అనుకున్నాను.నేను తప్పు ఒప్పులు చెప్పేకంటే.

ఒక అసోసియేషన్ పరంగా ఏం జరిగిందో బయటికి వస్తే బాగుంటుందని భావించాను.నిజంగా అందులో నా తప్పు ఉంటే చెప్పండి సరి చేసుకుంటాను.

కానీ ఎందుకు ఎస్కేప్ అవుతున్నారో తెలియడం లేదు.ఎందుకు నా మాటని వినిపించుకోవడం లేదు.

మా అసోసియేషన్ పిలిపించి, మాట్లాడి.మీరు ఒక స్టేట్‌మెంట్ ఇవ్వండి.

నా ఫ్యామిలీ, ముఖ్యంగా నాపై వచ్చే వార్తలతో మా అమ్మ బాధపడుతూ హెల్త్ పాడు చేసుకుంటుంది.నేను ఇక్కడికి ఏడ్వడానికి రాలేదు.

ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి వచ్చాను.కొందరికి సపోర్ట్‌గా ఉండటానికి మా అసోసియేషన్ కొన్ని ఫ్యామిలీస్ కోసం పెట్టింది కాదు కదా.నేను ఏం చెబుతున్నానంటే ఫస్ట్ నేను చెప్పేది వినండి.తర్వాత మీకు ఏది రైట్ అనిపిస్తే అది చేయండి.

నేను ఎవరిని హర్ట్ చేయాలని అనుకోవడం లేదు.రెండు వైపుల వారిని పిలిచి మాట్లాడి ఒక స్టేట్‌మెంట్ విడుదల చేయమని మాత్రమే కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube