యుక్త వయసు ప్రారంభం అయ్యిందంటే చాలు యువతి, యువకులను పనిగట్టుకుని మరీ వచ్చి మొటిమలు మదన పెడుతుంటాయి.ప్రశాంతత లేకుండా చేస్తాయి.
అందాన్ని తగ్గిస్తాయి.యవ్వనాన్ని పాడు చేస్తాయి.
ఈ మొటిమల కారణంగా ఎంతగానో బాధపడుతుంటారు.అయితే మొటిమలు( Pimples ) వచ్చాక వర్రీ అవ్వడం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ ఫేస్ వాష్( Natural Face Wash ) ను కనుక వాడితే మొటిమలు మీ దరిదాపుల్లోకి కూడా రావు.ఇంకెందుకు ఆలస్యం ఆ న్యాచురల్ ఫేస్ వాష్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్( Amla Powder ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ పీల్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడి( Sandalwood Powder ) వేసి స్పూన్ సహాయంతో అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.దాంతో మన ఫేస్ వాష్ సిద్ధం అయినట్లే.ఇప్పుడు ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని పెట్టుకోవాలి.ఈ పౌడర్ ను ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం.
అర చేతిలోకి తయారు చేసుకున్న పౌడర్ ను వన్ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుని వాటర్ తో లేదా రోజ్ వాటర్ తో స్మూత్ పేస్ట్ లా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా చర్మాన్ని రెండు నుంచి మూడు నిమిషాల పాటు రబ్ చేసుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ ను క్లీన్ చేసుకోవాలి.ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను రోజుకు ఒకసారి కనుక వాడితే మొటిమలకు దూరంగా ఉండవచ్చు.

చర్మం పై పేరుకుపోయిన మురికి, మృత కణాలు, జిడ్డు కారణంగానే మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి.అయితే ఈ న్యాచురల్ ఫేస్ వాష్ వాడటం వల్ల చర్మంపై డస్ట్ పార్టికల్స్ మరియు డెడ్ స్కిన్ సెల్స్( Dead Skin Cells ) తొలగిపోతాయి.అధిక జిడ్డు ఉన్నా సరే మాయం అవుతుంది.దాంతో మొటిమలు వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.అలాగే ఏమైనా మొటిమలు వాటి తాలూకు మచ్చలు ఉన్నా సరే మాయమవుతాయి.
