నాన్న పంచె కట్టు కు టాలీవుడ్ లో సాటి లేరు : నాగార్జున

అక్కినేని నాగేశ్వర్ రావు. తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయకుడు.

 Nagarjuna Emotional Words About Akkineni Panche Details, Nagarjuna, Akkineni Nag-TeluguStop.com

ధర్మపత్ని అనే సినిమాలో తొలిసారి చిన్న పాత్రలో కనిపించిన ఏఎన్నార్.సీతారామ జననం అనే సినిమాతో హీరోగా ఎదిగాడు.

ఆ తర్వాత వచ్చిన బాలరాజు సినిమాతో ఆయన స్టార్ హీరోగా ఎదిగాడు.ఆ తర్వాత వచ్చిన దేవదాసు సినిమాతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

తెలుగులో ఈ సినిమా ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయింది.

ఆ తర్వాత ఏఎన్నార్ ఎన్నో జానపద, పౌరాణిక సినిమాల్లో అద్భుత నటన కనబర్చాడు.

ఆయా పాత్రలకు తగ్గట్లుగా ఒదిగిపోయే స్వభావం ఆయన సొంతం.ఏ క్యారెక్టర్ అయినా అద్భుతంగా చేసేవాడు.

భక్త జయదేవ.భక్త తుకారాం .మహాకవి కాళిదాసు.చక్రధారి.

విప్ర నారాయణ వంటి సినిమాల్లో ఎంతో గొప్ప నటనతో ఆకట్టుకున్నాడు.అంతేకాదు.

జానపద సినిమాల్లోనూ ఆయన ఆకట్టుకున్న తీరు శభాష్ అనిపించింది.గ్రామీణ ప్రాంత యువకుడిగా ఎన్నో పాత్రలు చేశాడు.

తాజాగా ఆయన జయంతి సందర్భంగా తన తండ్రికి నాగార్జున ఘన నివాళి అర్పించాడు.ఇందులో ఆయన పంచెకట్టు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు.పంచె కట్టడం అంటే తన తండ్రికి ఎంతో ఇష్టం అని చెప్పాడు.

Telugu Akkineni, Anr, Bangarraju, Devadas, Naga Chaitanya, Nagarjuna, Pondurukha

పొందూరు ఖద్దరు పంచె కట్టడం అంటే ఆయన మరీ ఇష్టం అన్నాడు.ఆయన హారాలు, ఉంగరాలు, వాచ్ చూస్తుంటే.తన తండ్రిని చూసినట్లే ఉందని చెప్పాడు.

అంతేకాదు.వాటిని నాగార్జున ధరించి చూపించాడు.

ఆయన పంచెకట్టు చూపించడం కోసం బంగార్రాజు సినిమాలో ఆ గెటప్ వేసినట్లు చెప్పాడు.అటు సోగ్గాడే చిన్ని నాయనా అనే సినిమాలో పంచకట్టు వేసినట్లు చెప్పాడు.

బంగార్రాజు సినిమాను కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు.నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తుంది.

అటు నాగ చైతన్యతో పాటు కృతి శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను రానున్న సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube