టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమాతో మరో సక్సెస్ ను అందుకున్నారు.అన్ని ఏరియాల్లో ఈ సినిమా దాదాపుగా బ్రేక్ ఈవెన్ అయింది.ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతోంది.2025 సంవత్సరంలో బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.అయితే ఫేక్ రికార్డ్స్( Fake Records ) గురించి బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
అనంతపురంలో డాకు మహారాజ్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ జరగగా బాలయ్య తన రికార్డుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నా రికార్డ్స్ ఒరిజినల్ రికార్డ్స్ అని బాలయ్య అన్నారు.ఈ మధ్య కాలంలో పలు పెద్ద సినిమాలకు సంబంధించి ఫేక్ కలెక్షన్లు వైరల్ అవుతున్నాయి.థియేటర్లలో ఆక్యుపెన్సీకి, బుకింగ్స్ కు కలెక్షన్లకు ఏ మాత్రం పొంతన లేదు.
డాకు మహారాజ్ మూవీ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ కొన ఊపిరి ఉన్నంత వరకు సినిమాలలో నటిస్తానని చెప్పుకొచ్చారు.బాలయ్య ఈ విధంగా కామెంట్లు చేయడం ఒక విధంగా గ్రేట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సీనియర్ హీరోలలో బాలయ్య రూట్ సపరేట్ అనే సంగతి తెలిసిందే.
నచ్చిన డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ బాలయ్య విజయాలను అందుకుంటున్నారు.
స్టార్ హీరో, నట సింహం నందమూరి బాలకృష్ణ అఖండ సీక్వెల్ తో( Akhanda Sequel ) మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఫేక్ రికార్డ్స్ గురించి బాలయ్య చేసిన కామెంట్లు కొందరు హీరోలను ఉద్దేశించి చేసినవేనని చెప్పాల్సిన అవసరం లేదు.బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా అఖండ2 మూవీ బడ్జెట్ 120 నుంచి 130 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.