సౌతాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌లో( Kruger National Park ) జరిగిన ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆడ జీబ్రా( Female Zebra ) ప్రసవిస్తున్న సమయంలో, మగ జీబ్రా( Male Zebra ) దానిపై దాడి చేయడం, ఆపై పుట్టిన బిడ్డపై కూడా విరుచుకుపడటం అందరినీ కలచివేసింది.ఈ హృదయ విదారక దృశ్యాన్ని ఓ పర్యాటకుడు వీడియో తీసి, ‘లేటెస్ట్ సైటింగ్స్’ అనే యూట్యూబ్ ఛానెల్ తో షేర్ చేశాడు.
నదీన్ అనే పర్యాటకురాలు తన కుటుంబంతో కలిసి జీబ్రాల గుంపును చూస్తూ, ఓ తల్లి జీబ్రా బిడ్డకు జన్మనివ్వడాన్ని చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.“మేం మా 3 ఏళ్ల కూతురితో కలిసి జీబ్రాల గుంపును చూస్తుండగా, ఒక ఆడ జీబ్రా పడుకుని ఉండటం గమనించాం.అది బిడ్డను కనబోతోందని అర్థమైంది.ఆ ప్రత్యేక క్షణాన్ని చూసేందుకు మేం చాలా సంతోషించాం” అని నదీన్ చెప్పుకొచ్చింది.
వీడియో మొదట్లో, ఆడ జీబ్రా నేలపై పడుకుని ప్రసవ వేదనతో బాధపడుతూ కనిపిస్తుంది.ఇంతలో, మగ జీబ్రా ఒక్కసారిగా వచ్చి దానిపై దాడి చేయడం మొదలుపెడుతుంది.ఆ దారుణమైన దాడిని కూడా లెక్కచేయకుండా, ఆ తల్లి జీబ్రా తన బిడ్డను ప్రసవిస్తుంది.అప్పుడు మగ జీబ్రా తన దృష్టిని నవజాత శిశువుపైకి మారుస్తుంది.ఆ చిన్నారి జీబ్రాను నోటితో కొరుకుతూ, నేలకేసి అదిమిపెడుతుంది.ఆ దాడిలో చిన్న జీబ్రా తల పైకి ఎత్తడానికి ప్రయత్నించి, ఆపై ప్రాణాలు కోల్పోతుంది.
అప్పటికే అలసిపోయిన తల్లి జీబ్రా, తన బిడ్డను కాపాడుకోవడానికి మగ జీబ్రాతో పోరాడుతుంది.తన శక్తితో కాలుతో తన్నుతూ, దాన్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుంది.
కానీ, మగ జీబ్రా బలంగా ఉండటంతో, తల్లి జీబ్రా ప్రయత్నాలు విఫలమవుతాయి.ఎంత ధైర్యంగా పోరాడినా, తన బిడ్డను కాపాడుకోలేకపోతుంది.ఈ హృదయ విదారక ఘటన, ప్రకృతిలో కొన్నిసార్లు ఎంత క్రూరత్వం ఉంటుందో తెలియజేస్తుంది.ఈ లింకు https://youtu.be/m2NxZ-zFNV0?si=yRku_cgzDXmAJSKH మీద క్లిక్ చేసి వీడియో చూడవచ్చు.