సినిమా రంగంలో మాత్రమే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు, సంఘటనల కారణంగా రాంగోపాల్ వర్మ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.అయితే, ఈసారి కోర్టు తీర్పు రూపంలో వచ్చిన సమస్య వర్మకు పెద్ద దెబ్బగా మారింది.టాలీవుడ్‌లో తన విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ( Ram Gopal Varma ) కు కోర్టు షాక్ ఇచ్చింది.2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో,( Cheque Bounce Case ) ముంబై అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు( Andheri Magistrate Court ) తాజాగా సంచలనాత్మక తీర్పు ప్రకటించింది.ఈ తీర్పులో వర్మను దోషిగా తేలుస్తూ, మూడు నెలల జైలు శిక్షను విధించింది.
2018లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రాంగోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసు నమోదు చేశారు.అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, కోర్టు వర్మకు పలుమార్లు హాజరుకావాలని నోటీసులు పంపింది.కానీ, వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాలేదు.
ఈ పరిణామాలు కోర్టు ఆగ్రహానికి దారి తీసింది.దింతో వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్( Non Bailable Warrant ) జారీ చేసింది.
విచారణ చివరలో కోర్టు తుది తీర్పు ప్రకటించగా.వర్మకు మూడు నెలల సాధారణ జైలు శిక్షను విధించింది.
తదుపరి చర్యగా.వర్మకు రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదుదారుడైన మహేష్ చంద్ర మిశ్రాకు రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.ఈ మొత్తాన్ని చెల్లించకపోతే, విధించిన జైలు శిక్ష తప్పదని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు.ఈ కేసులో వర్మ స్పందన ఎలా ఉండబోతుందో చూడాలి.కానీ, కోర్టు తీర్పు ప్రకారం, ఫిర్యాదుదారుడికి పరిహారం చెల్లించడం లేదా జైలు శిక్ష అనుభవించడం తప్పనిసరిగా కనిపిస్తోంది.