నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఏమాత్రం విరామం లేకుండా గడుపుతున్నారు.ఒకవైపు సౌత్ సినిమాలతో పాటు మరోవైపు బాలీవుడ్ సినిమాలలో నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా ఈమె అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప 2( Pushpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఇక ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలోనే రష్మిక మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
రష్మిక ఇటీవల యానిమల్ అనే బాలీవుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే హిట్ అందుకున్నారు అయితే త్వరలోనే మరో బాలీవుడ్ చిత్రం ఛావా( Chhaava ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.లక్ష్మణ్ ఉటేకర్( Laxman Utekar ) దర్శకత్వంలో విక్కీ కౌశల్( Vicky Kaushal ) రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటించిన ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక నటించబోతున్నారు.ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ముంబైలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా రష్మిక మాట్లాడుతూ తాను ఏసు భాయి పాత్రలో నటించడం చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు.
ఒక నటిగా ఇంతకు మించి ఏం కావాలన్నారు.తాను ఓ సారి డైరెక్టర్ లక్ష్మణ్ సర్ తో మాట్లాడుతూ.ఇలాంటి పాత్ర నటించిన తర్వాత తాను చాలా సంతోషంగా రిటైర్ కూడా కావచ్చు అంటూ కూడా డైరెక్టర్ దగ్గర పలు సందర్భాలలో చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు.ఇలా తాను రిటైర్ కావచ్చు అనే వ్యాఖ్యలు రష్మిక చేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు.