12 ఢీ షో సీజన్స్ లో గెలుపొందిన విన్న‌ర్స్ మ‌రియు మాస్ట‌ర్స్ వీరే

ఈటీవీలో దుమ్మురేపే ప్రోగ్రాం ఢీ డాన్స్ షో.తెలుగునాట ఇదో పాపుల‌ర్ షో.2009లో ప్రారంభ‌మైన ఈషో.ఇప్ప‌టి వ‌ర‌కు 12 సీజ‌న్స్‌ను కంప్లీట్ చేసుకుంది.ఎంతో మంది డాన్స‌ర్ల‌ను, కొరియోగ్ర‌ఫ‌ర్ల‌ను సినీ ప‌రిశ్ర‌మ‌కు అందించింది.ప్ర‌స్తుతం టాప్ కొరియోగ్ర‌ఫ‌ర్లుగా చ‌లామ‌ణి అవుతున్న శేఖ‌ర్ మాస్ట‌ర్, జానీ మాస్ట‌ర్, గ‌ణేష్ మాస్ట‌ర్లు ఈషో నుంచి వ‌చ్చివాళ్లే కావ‌డం విశేష్.

 Dhee  12 Seasons Winners And Their Masters,dhee All Seasons, Dhee Show, Dhee 1 T-TeluguStop.com

ఇప్ప‌టి వ‌ర‌కు ఢీ టైటిల్ గెలిచిన మాస్ట‌ర్లు, కంటెస్టెంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!


ఢీ1 -2009:

తొలిసీజ‌న్‌లో ఢీ టైటిల్‌ను కంటెస్టెంట్ హరినాథ్ రెడ్డి ద‌క్కించుకున్నాడు.ఆయ‌న‌కు మాస్ట‌ర్‌గా నోబెల్ వ్య‌వ‌హ‌రించాడు.

ఢీ2 -2010:

రెండో సీజ‌న్ విజేత‌గా కంటెస్టెంట్ పృథ్వీ నిలిచాడు.త‌న‌కు కొరియోగ్ర‌ఫ‌ర్‌గా గణేష్ మాస్టర్ వ్య‌వ‌హ‌రించాడు.


ఢీ3 -2011:

ఢీ మూడోసీజ‌న్ విన్న‌ర్‌గా కంటెస్టెంట్ సత్య ఎంపిక‌య్యాడు.ఇత‌డికి కొరియోగ్ర‌ఫ‌ర్‌గా రఘు మాస్టర్ ఉన్నాడు.

ఢీ4 లేడీస్ స్పెషల్ – 2012

ఈ షో టైటిల్ విన్న‌ర్‌గా కంటెస్టెంట్ భవ్య నిలిచింది.ఈమెకు కొరియోగ్ర‌ఫ‌ర్‌గా రీతూ మాస్టర్ వ్య‌వ‌హ‌రించింది.

Telugu Dhee Winners, Dheewinners, Dhee, Dhee Show-Telugu Stop Exclusive Top Stor

ఢీ5 జోడి స్పెషల్ – 2013

ఈ టైటిల్‌ను ప్రసాద్, అనుష్క గెల్చుకున్నారు.వీరికి శేఖర్ మాస్టర్ కొరియోగ్ర‌ఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

ఢీ6 – 2014

ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా కంటెస్టెంట్ అన్షు నిలిచింది.సుచిన్ మాస్టర్ కొరియోగ్ర‌ఫ‌ర్ గా చేశాడు.

ఢీ జూనియర్స్ 1 – 2015

ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా కంటెస్టెంట్ వ‌ర్షిణి నిలిచింది.భూషణ్ మాస్టర్ కొరియోగ్ర‌ఫ‌ర్‌గా ఉన్నాడు.

ఢీ జూనియర్స్ 2 – 2016

ఈ షో విన్న‌ర్‌గా కంటెస్టెంట్ శివ‌మ‌ణి నిలిచాడు.యశ్వంత్ మాస్టర్ కొరియోగ్ర‌ఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

ఢీ జోడి స్పెషల్ – 2017

ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా సంకేత్, ప్రియాంక్ నిలిచారు.వీళ్ల‌కు యశ్వంత్ మాస్టర్ కొరియోగ్ర‌ఫ‌ర్‌గా ఉన్నాడు.

ఢీ 10 – 2018

ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా రాజు అయ్యాడు.చిట్టీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

ఢీ జోడి – 2019

ఈ షో విన్న‌ర్‌గా మ‌హేష్, రీతు నిలిచారు.ప్ర‌శాంత్ మాస్ట‌ర్ కొరియోగ్రఫ‌ర్‌గా ఉన్నాడు.

కంటెస్టెంట్ : మహేష్ అండ్ రీతు

ఢీ ఛాంపియన్స్ – 2020

ఈ టైటిల్ విన్న‌ర్‌గా పీయూష్ ఎంపిక అయ్యాడు.య‌శ్వంత్ మాస్ట‌ర్ కొరియోగ్రఫీ అందించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube