రాజ్యసభ టీడీపీ ఎంపీలు ఇటీవల బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే.ఒకపక్క నలుగురు ఎంపీలు బీజేపీ లో చేరడం తో ఇంకా ఎంతమంది ఫిరాయింపులకు పాల్పడతారో అన్న టెన్షన్ లో ఉండగా, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్ ప్రకారమే ఆ నలుగురు ఎంపీలను బీజేపీ పార్టీలోకి పంపించారు అంటూ వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆరోపించారు.
బీజేపీ లో చేరిన టీడీపీ ఎంపీ లు ముగ్గురు బాబు బినామీ లే అని,తనపై ఎలాంటి అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమే వారిని బాబు బీజేపీ లోకి పంపించారు అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఒకవేళ నిజంగా ఇదంతా ఆయనకు తెలియకుండానే జరిగితే ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్‌కు లేఖ అయినా రాసి ఉండేవారు.
కానీ అలాంటిది ఏమి లేదు.కావున ఇది 100% మ్యాచ్ ఫిక్సింగే నంటూ విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.అలానే బాబు విహార యాత్ర పై కూడా విజయ సాయిరెడ్డి కామెంట్ చేశారు.ఆయన విహార యాత్రకు ఈదేశం వెళ్లారో అన్న క్లారిటీ కూడా టీడీపీ నేతలకు లేదు.
స్విట్జర్లాండ్ వెళ్లారో,స్వీడన్ వెళ్లారో కూడా చెప్పలేనంత పరిస్థితిలో ఉన్నారు అంటూ సెటైర్లు వేశారు.యూరప్ నుంచి బాబు ఫోన్ చేసి ముఖ్య నాయకులతో మాట్లాడినట్లు ఎల్లో మీడియా పేర్కొంది.
అసలు యూరప్ అనేది ఒక దేశం కాదు, 44 దేశాలు ఉన్న ఒక ఖండం అన్న విషయాన్నీ మర్చిపోయారు.

అలానే తెలంగాణ ప్రభుత్వ ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కూడా విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.సొంత నిధులతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసింది.45 లక్షల ఎకరాలకు నీరందుతుంది.కేంద్రం నిధులిచ్చినా ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సగం కూడా నిర్మించలేక పోయారు.ఎంత సేపు నిధులను దోచుకోవడం తప్ప పూర్తి చేయాలన్నసంకల్పమే లేదు అంటూ ఆయన మండిపడ్డారు.