ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్( Kim Jong Un ) ఆకృత్యాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తన తల తిక్క నిర్ణయాలతో ఉత్తర కొరియా( North Korea ) ప్రజలను ముప్పుతెప్పలు పెడుతూ, చిత్రహింసలకు గురిచేస్తు ఉండడం కిమ్ స్టైల్.
దేశంలో నియంతృత్వ పాలనను అమలు చేస్తూ, ప్రజలకు, అధికారులకు తన పైశాచికత్వాన్ని చూపిస్తూ ఉంటాడు .ప్రజలు , అధికారులు ఎవరైనా కిమ్ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే .అలా కాదని ఎవరైనా వ్యవహరించారో ఇక అంతే సంగతులు.ఇక తన తాత , తండ్రి తనని దేవుడిగా ప్రజలు పూజించాలని షరతులు ప్రజలకు విధించిన వింత మనిషి కిమ్.
ఎప్పటికప్పుడు అణ్వాయుదాలను ఆయుధాలను ప్రదర్శిస్తూ, ప్రత్యర్థి దేశాలను భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు .ముఖ్యంగా దక్షిణ కొరియా టార్గెట్ గా అనేక దాడులకు దిగుతూ ఉంటారు.ఇక విషయానికొస్తే.కిమ్ జోంగ్ ఉన్ నాయకత్వంపై ఎవరు తిరుగుబాటు చేయడమే కాదు, చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే దారుణంగా చంపించడం కిమ్ స్టైల్. ఇప్పటికే అనేకమందిని ఈ విధంగా చంపిన చరిత్ర కూడా ఉంది.
తాజాగా ఈ ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.తిరుగుబాటుకు పాల్పడుతున్నాడనే అనుమానంతో సైన్యంలోని ఓ జనరల్ స్థాయి అధికారిని అత్యంత పైసాచికంగా హత్య చేయించారు.ఆ శరీర భాగాలను మాంసాహారాన్ని ఆహారంగా తీసుకునే అత్యంత ప్రమాదకరమైన చేపలైన ‘ పిరాన్హ ‘ చేపలకు( Piranha Fish ) ఆహారంగా వేసినట్లు డైలీ స్టార్ నివేదించింది.
తిరుగుబాటుకు కుట్ర చేశాడనే అనుమానంతో ఆ సైనిక జనరల్ అధికారి కాళ్లు చేతులు నరికి ‘ పిరాన్హ ‘ చేపలు ఉన్న ఫిష్ ట్యాంక్ లో పడేసి చంపడం సంచలనం రేపింది.
కిమ్ సాగ్ రెసిడెన్స్ లో ఈ భారీ ఫిష్ ట్యాంక్ ఏర్పాటు చేసినట్లు డైలీ స్టార్ నివేదించింది.కిమ్ తన అక్వేరియం కోసం వందల పిరాన్హ చేపలను బ్రెజిల్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నాడట కిమ్.మాంసాన్ని తినే ఈ చేపలు పదునైన రేజర్ దంతాలను కలిగి ఉంటాయి.కొన్ని నిమిషాల వ్యవధిలోనే మాంసాన్ని చీల్చి తినేస్తాయి.2011లో అధికారంలో చేపట్టిన కిమ్ జొంగ్ ఉన్ ఇప్పటివరకు పలు ఆరోపణలపై 16 మంది అధికారులకు ఈ తరహా శిక్షలు విధించారట.