ఓరి పాపాత్ముడా : సైనికాధికారిని చేపలకు ఆహారంగా వేసిన కిమ్
TeluguStop.com
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్( Kim Jong Un ) ఆకృత్యాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
తన తల తిక్క నిర్ణయాలతో ఉత్తర కొరియా( North Korea ) ప్రజలను ముప్పుతెప్పలు పెడుతూ, చిత్రహింసలకు గురిచేస్తు ఉండడం కిమ్ స్టైల్.
దేశంలో నియంతృత్వ పాలనను అమలు చేస్తూ, ప్రజలకు, అధికారులకు తన పైశాచికత్వాన్ని చూపిస్తూ ఉంటాడు .
ప్రజలు , అధికారులు ఎవరైనా కిమ్ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే .అలా కాదని ఎవరైనా వ్యవహరించారో ఇక అంతే సంగతులు.
ఇక తన తాత , తండ్రి తనని దేవుడిగా ప్రజలు పూజించాలని షరతులు ప్రజలకు విధించిన వింత మనిషి కిమ్.
ఎప్పటికప్పుడు అణ్వాయుదాలను ఆయుధాలను ప్రదర్శిస్తూ, ప్రత్యర్థి దేశాలను భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు .
ముఖ్యంగా దక్షిణ కొరియా టార్గెట్ గా అనేక దాడులకు దిగుతూ ఉంటారు.ఇక విషయానికొస్తే.
కిమ్ జోంగ్ ఉన్ నాయకత్వంపై ఎవరు తిరుగుబాటు చేయడమే కాదు, చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే దారుణంగా చంపించడం కిమ్ స్టైల్.
ఇప్పటికే అనేకమందిని ఈ విధంగా చంపిన చరిత్ర కూడా ఉంది. """/" /
తాజాగా ఈ ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
తిరుగుబాటుకు పాల్పడుతున్నాడనే అనుమానంతో సైన్యంలోని ఓ జనరల్ స్థాయి అధికారిని అత్యంత పైసాచికంగా హత్య చేయించారు.
ఆ శరీర భాగాలను మాంసాహారాన్ని ఆహారంగా తీసుకునే అత్యంత ప్రమాదకరమైన చేపలైన ' పిరాన్హ ' చేపలకు( Piranha Fish ) ఆహారంగా వేసినట్లు డైలీ స్టార్ నివేదించింది.
తిరుగుబాటుకు కుట్ర చేశాడనే అనుమానంతో ఆ సైనిక జనరల్ అధికారి కాళ్లు చేతులు నరికి ' పిరాన్హ ' చేపలు ఉన్న ఫిష్ ట్యాంక్ లో పడేసి చంపడం సంచలనం రేపింది.
"""/" /
కిమ్ సాగ్ రెసిడెన్స్ లో ఈ భారీ ఫిష్ ట్యాంక్ ఏర్పాటు చేసినట్లు డైలీ స్టార్ నివేదించింది.
కిమ్ తన అక్వేరియం కోసం వందల పిరాన్హ చేపలను బ్రెజిల్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నాడట కిమ్.
మాంసాన్ని తినే ఈ చేపలు పదునైన రేజర్ దంతాలను కలిగి ఉంటాయి.కొన్ని నిమిషాల వ్యవధిలోనే మాంసాన్ని చీల్చి తినేస్తాయి.
2011లో అధికారంలో చేపట్టిన కిమ్ జొంగ్ ఉన్ ఇప్పటివరకు పలు ఆరోపణలపై 16 మంది అధికారులకు ఈ తరహా శిక్షలు విధించారట.
దిల్ రుబా కథను రివీల్ చేసిన కిరణ్ అబ్బవరం.. క మూవీని మించిన హిట్ పక్కా!