ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది కిడ్నీ స్టోన్స్( Kidney Stones ) సమస్యతో బాధపడుతున్నారు.కిడ్నీ స్టోన్స్ పలు రకాలుగా ఉంటాయి.
ఎక్కువగా కనిపించే రకం కాల్షియం స్టోన్స్.( Calcium Stones ) ఇవి కాల్షియం ఆక్సలేట్ లేదా కాల్షియం ఫాస్ఫేట్ వల్ల ఏర్పడతాయి.
అలాగే మూత్ర మార్గ ఇన్ఫెక్షన్‌ల వల్ల ఏర్పడేవి స్ట్రువైట్ స్టోన్స్.మాంసాహారంలో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏర్పడేవి యూరిక్ ఆమ్లం స్టోన్స్.
ఇక చాలా అరుదుగా కనిపించే రకం సిస్టైన్ స్టోన్స్.జన్యు సంబంధిత సమస్యల వల్ల ఇవి ఏర్పడతాయి.
కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి వివిధ కారణాలు ఉంటాయి.ప్రధానంగా చూసుకుంటే మూత్రంలో( Urine ) అధికంగా కాల్షియం లేదా యూరిక్ ఆమ్లం ఉండటం, నీరు తక్కువగా తాగడం, సాల్ట్, ప్రోటీన్, మరియు పంచదారను అధికంగా తీసుకోవడం, డయాబెటిస్, హైబర్‌టెన్షన్, ఓబెసిటీ వంటి ఆరోగ్య సమస్యలు, లైఫ్ స్టైల్, మలబద్ధకం, జన్యు సంబంధిత కారణాలు కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి కారణం అవుతుంటాయి.
కిడ్నీ స్టోన్స్ పరిమాణం చిన్న రేణువుల నుంచి పెద్ద కంకరాల వరకు ఉంటూ, వాటి ఆధారంగా లక్షణాలు కనిపిస్తాయి.ప్రాథమిక దశలో సాధారణంగా లక్షణాలు ఉండవు.మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నప్పుడు నడుము, పొట్ట, లేదా వెన్ను భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది.మూత్రం నిరంతరం రావాలనిపించడం, కానీ తక్కువగా రావడం, మూత్రంలో రక్తం కనపడటం, మూత్రంలో దుర్వాసన, అలసట, జ్వరం, చలి, వాంతులు, వికారం, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ లక్షణాలు ఎదురైతే, వీలైనంత త్వరగా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.లేదంటే కిడ్నీ స్టోన్స్ ను రిమూవ్ చేయడానికి ఆపరేషన్ వరకు వెళ్లాల్సి ఉంటుంది.ఇక మూత్రపిండాల్లో రాళ్లు కరగడానికి అధికంగా నీళ్లు( Water ) తీసుకోవాలి.ఆక్సలేట్ తక్కువగా ఉండే పండ్లు మరియు కూరగాయలు అధికంగా తీసుకోవాలి.మద్యపానం, కార్బొనేటెడ్ డ్రింక్స్‌ను నివారించాలి.ఆహారంలో ఉప్పు మరియు ప్రోటీన్ పరిమితంగా తీసుకోవాలి.