ఒంటరిగా, దిగులుగా ఉన్నారా, అయితే ఒక హగ్( Hug ) మీ మూడ్ మార్చేస్తుంది.సైన్స్ కూడా ఇదే చెబుతోంది.
హగ్ చేసుకోవడం, ఒడిలో పడుకోబెట్టుకొని ఓదార్చడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా, మనుషుల మధ్య ఉండే ఆ రియల్ కనెక్షన్స్‌కు అది సాటి రాదు.
అందుకే బాగా డెవలప్ అయిన దేశాల్లో కూడా ఒంటరితనం( Loneliness ) పెరిగిపోతోంది.ఈ సమస్యకు టోక్యోలో( Tokyo ) ఒక సూపర్ ఐడియా వచ్చింది.
అక్కడ ఒక స్పెషల్ కేఫ్ ఉంది.అక్కడ ఫుడ్, డ్రింక్స్‌తో పాటు ఓదార్పు కూడా దొరుకుతుంది.
టోక్యోలోని సోనీయా కేఫ్ ను( Soineya Cafe ) పేరుకు తగ్గట్టే ఒంటరిగా ఫీలయ్యేవాళ్ల కోసం స్పెషల్‌గా డిజైన్ చేశారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, ఈ కేఫ్‌లో కస్టమర్లకు ఎమోషనల్ సపోర్ట్ కోసం కౌగిలింత సర్వీసులు ఉన్నాయి.
ఇక్కడ వెయిట్రెస్‌లు( Waitress ) కస్టమర్లను హగ్ చేసుకుంటారు లేదా వాళ్ల ఒళ్లో తల పెట్టుకుని పడుకోనిస్తారు.కానీ, ఇవన్నీ ఉచితం కాదు, దీనికోసం లవ్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

ఇక్కడ కంఫర్ట్ సర్వీసులకు రేట్లు చూస్తే ఒక వెయిట్రెస్ ఒడిలో తల పెట్టుకుని 3 నిమిషాలు రిలాక్స్ అవ్వాలంటే 1,000 యెన్లు (దాదాపు రూ.550) కట్టాలి.అదే వెయిట్రెస్ ఒడిలో 20 నిమిషాలు హాయిగా నిద్రపోవాలంటే 3,000 యెన్లు (దాదాపు రూ.1,700) అవుతుంది.ఇక రాత్రంతా అంటే 10 గంటల సెషన్ కోసం అయితే ఏకంగా 50,000 యెన్లు (సుమారు రూ.27,000) ఖర్చు చేయాల్సిందే.అంతేకాదు, ఊరటనిచ్చేలా నిమురుతూ ఉండటం లేదా జస్ట్ ఒక నిమిషం పాటు చూస్తూ ఉండటానికి కూడా ఇలాంటి ఫీజులే ఉన్నాయి.

ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.ఇదంతా కేవలం ఎమోషనల్ కంఫర్ట్ కోసమే.శారీరక సంబంధాలకు ఇక్కడ అస్సలు ఛాన్స్ లేదు.
రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి.కస్టమర్లు వెయిట్రెస్‌లతో చాలా మర్యాదగా మాట్లాడాలి, వాళ్ల జుట్టు పట్టుకోవడం కానీ, మితిమీరి ప్రవర్తించడం కానీ అస్సలు కుదరదు.
ఎవరైనా భావోద్వేగంగా హీల్ అవ్వడానికి ఇదొక సేఫ్ ప్లేస్ అంతే.