Skin White : మిల్క్ తో మిల్కీ వైట్ గా మారాలనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీ మీ కోసమే!

తమ స్కిన్ వైట్ ( Skin white ) గా, బ్రైట్ గా మెరిసిపోతూ కనిపించాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు.అటువంటి స్కిన్ కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు.

 Try This Simple Home Remedy For Milky White Skin-TeluguStop.com

రకరకాల చర్మ ఉత్పత్తులను వాడుతుంటారు.అయితే అటువంటి చర్మాన్ని పొందడానికి కొన్ని కొన్ని ఇంటికి చిట్కాలు కూడా ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.

ముఖ్యంగా పాలు చర్మ ఆరోగ్యాన్ని పెంచడానికి ఎంతగానో తోడ్పడతాయి.మిల్క్ లో అనేక బ్యూటీ సీక్రెట్స్ దాగి ఉన్నాయి.

మిల్క్ తో మిల్కీ వైట్ గా మారాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ రెమెడీ ని అస్సలు మిస్ అవ్వకండి.

ఈ రెమిడీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పును( Red lentils ) వేసుకుని వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.

ఆపై ఒక కప్పు పచ్చి పాలు( raw milk ) వేసుకొని మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ లో నానబెట్టుకున్న కందిపప్పును పాలతో సహా వేసుకుని స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్( Beet root powder ), వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, చిటికెడు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Remedy, Latest, Milk, Milk Benefits, Skin Care, Skin Care Tips, Ski

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ కూల్ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే మస్తు బెనిఫిట్స్ పొందుతారు.

ఈ రెమెడీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.చర్మ కణాలను ఉత్తేజంగా మారుస్తుంది.

Telugu Tips, Remedy, Latest, Milk, Milk Benefits, Skin Care, Skin Care Tips, Ski

అలాగే ఈ రెమెడీ మురికి, మృతకణాలను తొలగిస్తుంది.చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది.కాబట్టి వైట్ అండ్ బ్రైట్ స్కిన్ కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.ఇక చాలామంది డ్రై స్కిన్ తో బాధపడుతుంటారు.అలాంటి వారికి కూడా ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.పాలులో ఉండే పోషకాలు చర్మం తేమగా ఉంచుతాయి.

డ్రై అవ్వకుండా కాపాడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube