టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Tollywood megastar Chiranjeevi) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు చిరంజీవి(Chiranjeevi).
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి మొహర్ రమేష్ (Megastar Chiranjeevi Mohar Ramesh)కాంబినేషన్లో 2023 లో విడుదలైన సినిమా బోళాశంకర్.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది.బోలెడన్ని ఆశలతో థియేటర్ కు వెళ్లిన అభిమానులకు నిరాశ ఎదురయ్యింది.

అయితే మొహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మించారు.ఎన్నో అంచనాల నడుమ విడుదలైన భోళా శంకర్(Bhola Shankar ) సినిమా అభిమానులను భారీగా నిరాశపరిచింది.అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమా ఓటిటిలో కూడా దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాను ఒక హీరో మనవడు ఏకంగా 1000 సార్లు చూసాడట.

ఇంతకీ ఆ పిల్లవాడు ఎవరు అన్న విషయానికి వస్తే.ఈ భోళా శంకర్ (Bhola Shankar )మూవీని ఒకప్పటి హీరో,విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ బాలాజీ మనవడు 1000 సార్లు చూసాడట.ఈ విషయాన్ని బాలాజీ నే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.
బాలాజీ 80 వ దశకంలో చిరంజీవి, అర్జున్, సుమన్, బాలకృష్ణ హీరోలుగా వచ్చిన చాలా సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ లో సూపర్ గా నటించి అశేష ప్రేక్షాభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 1000 సార్లు చూసేంతలా ఆ సినిమాలో ఏమి నచ్చింది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.