ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.50
సూర్యాస్తమయం: సాయంత్రం.6.08
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ఉ.11.32 ల12.08 సా4.32 ల5.20
దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36
మేషం:
ఈరోజు అనుకున్న వ్యవహారాలు సజావుగా సాగవు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులతో ప్రవర్తన వలన బాధలు కలుగుతాయి.వ్యాపారమున తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు.ఉద్యోగాలలో పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి.
వృషభం:
ఈరోజు వృత్తి వ్యాపారమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి.
పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.
మిథునం:
ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది.నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
కర్కాటకం:
ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.మొండి బాకీలు వసూలవుతాయి.వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.
ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు.గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
సింహం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఒక శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.కుటుంబ సభ్యులతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కన్య:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందర పడకూడదు.
ఈ రోజు మీరు చాలా ఓపికతో ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
తుల:
ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
శత్రువుల కు దూరంగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ప్రయాణంలో పరిచయాలు ఏర్పడతాయి.
ధనుస్సు:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.భవిష్యత్తులో లాభాలుంటాయి.దూర ప్రాంతం బంధువుల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో పంచుకుంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి.
కుంభం:
ఈరోజు సన్నిహితుల ప్రోద్బలంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు.
సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో పనులు సకాలంలో పూర్తిచేసి అధికారుల ఆదరణ పొందుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనం:
ఈరోజు కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి.నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మందగిస్తాయి.ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక నిరాశ కలిగిస్తాయి.
ధన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.