హత్య సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.అయితే ఈ కేసు విషయంలో అసలు నిందితురు ఎవరు అన్న చాలా పెద్ద చర్చ జరిగింది.

 Hathya Movie Review, Hathya Movie, Hathya Movie Review, Tollywood, Vivekananda M-TeluguStop.com

వైఎస్ అవినాష్ రెడ్డి మీద వివేకా కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేశారు.వివేక వివాహేతర సంబంధం సైతం వార్తల్లో నిలిచింది.

ఈ విషయంలో జగన్ రెడ్డి ఫై అనుమానం వ్యక్తం చేసిన నేతలు సైతం ఉన్నారు. వైఎస్ వివేకానంద మర్డర్ మిస్టరీ ( YS Vivekananda Murder Mystery )కొన్ని సినిమాలలో ప్రస్తావనకు వచ్చింది.

తాజాగా ఇదే అంశం గురించి హత్య అనే సినిమాను రూపొందించారు.మరి సినిమా ఎలా ఉంది కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే.

కథ :

ప్రముఖ రాజకీయ నాయకుడు జేసి ధర్మేంద్ర రెడ్డి( JC Dharmendra Reddy ) (రవి వర్మ) హత్యకు గురవుతారు.అయితే మొదట గుండెపోటు కారణంగా ఆయన మరణించారని వార్తలు వస్తాయి.

తర్వాత గొడ్డలి వేటు ఆయన ప్రాణాలు పోవడానికి కారణమని తెలుస్తుంది.ధర్మేంద్ర రెడ్డి అన్న కుమారుడు కిరణ్ రెడ్డి (భరత్ రెడ్డి) ముఖ్యమంత్రి అయిన తర్వాత వివేకా హత్య కేసును పరిష్కరించడం కోసం సిట్ ఏర్పాటు చేస్తారు.

ఐపీఎస్ ఆఫీసర్ సుధ (ధన్యా బాలకృష్ణ) చేతికి కేసు అప్పగిస్తారు.ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో సుధ ఏం తెలుసుకున్నారు? ధర్మేంద్ర కుమార్తె కవితమ్మ (హిమబిందు), ధర్మేంద్ర రెండో భార్య సలీమా (పూజ రామచంద్రన్), జెసి కుటుంబం హత్యకు ఎవరు కారణం? సుధ విచారణలో చివరకు ఏం తెలిసింది? అసలు నిందితులు బయటపడ్డారా లేదా? ఈ విషయాలన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అవగాహన ఉన్న సామాన్య ప్రజలకు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే సినిమా ప్రారంభానికి ముందే అందులో కథ క్యారెక్టర్లు అన్ని కల్పితం అని డైరెక్టర్ ముందుగా చెప్పినప్పటికీ హత్య సినిమా ట్రైలర్ చూస్తేనే మనకు ఇది వివేకానంద మర్డర్ మిస్టరీ మీద చేసిన సినిమా అని అర్థం అవుతుంది.

వివేక పేరును ధర్మేంద్రగా, పులివెందులను ఇల్లందుగా, జగన్మోహన్ రెడ్డిని కిరణ్ రెడ్డిగా( Jaganmohan Reddy as Kiran Reddy ), అవినాష్ రెడ్డిని వెంకటేష్ రెడ్డిగా, కడపను కురుప్పుగా పేర్లు మార్చారు.సినిమాలో రియల్ లైఫ్ లో పాత్రను ఎవరు పోషించారు అన్న విషయాన్ని ప్రేక్షకులు తొందరగానే పసిగట్టవచ్చు.

సినిమా చూసినంత సేపు ఏదో కొత్త విషయం స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు అర్థం అవుతూ ఉంటుంది.ఈ విషయంలో దర్శకురాలు శ్రీవిద్య బసవ కొంత సక్సెస్ అయ్యారు.

ఇంటర్వెల్ వరకు ప్రజలకు తెలిసిన కథే స్క్రీన్ మీద వస్తుంది.దాంతో ఎగ్జైట్ చేసే సీన్లు గానీ, స్క్రీన్ ప్లే గానీ పడలేదు.

ముఖ్యంగా క్లైమాక్స్ ముందు తాను నమ్మిన కథను చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.ప్రజలకు తెలియని విషయాలను, తాను నమ్మిన థియరీని చాలా కన్వీన్సింగ్‌ గా చెప్పారు శ్రీవిద్య.

Telugu Hathya, Hathya Review, Tollywood, Vivekananda-Movie

నటీనటుల పనితీరు:

ఇకపోతే సినిమాలో నటీనటుల పనితీరు విషయానికి వస్తే.ఐపీఎస్ అధికారిగా ధన్య బాలకృష్ణ( Dhanya Balakrishna ) బాగానే నటించి మెప్పించింది.ఇక ధర్మేంద్ర గారి రవి వర్మ, సలీమాగా పూజా రామచంద్రన్( Pooja Ramachandran as Salima ) చాలా అద్భుతంగా నటించారు.ఇలా ఎవరి పాత్రలో పరిధి మేరకు వారు బాగానే నటించారు.

జగన్ రెడ్డి పాత్రలో నటించిన భరత్ రెడ్డి ( Bharat Reddy )ఆ మేనరిజం ని చూపించారు.ఇమిటేట్ చేయలేదు.

Telugu Hathya, Hathya Review, Tollywood, Vivekananda-Movie

సాంకేతికత :

సాంకేతికంగా కూడా ఈ సినిమా బావుంది. మర్డర్ మిస్టరీ సీన్లలో ఆర్ఆర్ బాగా చేశారు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.కెమెరా వర్క్స్ కూడా బాగున్నాయి.పాటలు కూడా అన్ని బాగానే ఉన్నాయి.సినిమాలు సన్నివేశాలు బ్యాగ్రౌండ్ ఇవన్నీ చూస్తే నిర్మాత ప్రశాంత్ రెడ్డి ఖర్చు విషయంలో ఎక్కడ రాజీ పడలేదన్న విషయం అర్థమవుతుంది.మొత్తంగా అవుట్ ఫుట్ బాగానే వచ్చిందని చెప్పాలి.

రేటింగ్ :

3/5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube