యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Young Tiger Jr.NTR )గత ఆరేళ్లలో కేవలం ఆర్.ఆర్.ఆర్, దేవర ( RRR, Devara )సినిమాలలో మాత్రమే నటించారు.ఈ సినిమాలతో తారక్ కు విజయాలు దక్కినప్పటికీ తారక్ నిదానంగా సినిమాలలో నటించడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఈ ఏడాది తారక్ హృతిక్ తో కలిసి నటించిన వార్2 రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో తారక్ పాత్ర ప్రాధాన్యత గురించి స్పష్టత రావాల్సి ఉంది.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neil )కాంబో సినిమాను 2026 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు మొదలుకాలేదు.ఈ విధంగా జరగడం వల్ల 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
తారక్ త్వరగా ఈ సినిమాకు డేట్స్ కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కథకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ఈ సినిమాకు డ్రాగన్ ( Dragon )అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ బడ్జెట్ 350 కోట్ల రూపాయలు( 350 crore rupees ) అని సమాచారం అందుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం మార్కెట్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉండగా ఈ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.సలార్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించేలా ప్రశాంత్ నీల్ అడుగులు వేస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ సులువుగా 1000 కోట్ల రూపాయల మార్కును సులువుగానే అందుకునే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.