మన వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో నల్ల యాలకులు( Black cardamom ) కూడా చాలా ఆరోగ్యకరమైనవి.వీటిని బడి ఇలాచి అని కూడా అంటారు.
ముఖ్యంగా మసాలా వంటకాలలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.అలాగే యాలకులు నల్లగా చక్కటి వాసన కలిగి ఉంటాయి.
వీటిని వంటలలో వాడడం వలన వంటల రుచి కూడా బాగా పెరుగుతుంది.ఇంకా ఈ యాలకులు ఉపయోగించడం వలన మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ఇక సాధారణ యాలకుల వల్ల నల్ల యాలకుల పూలు కూడా మన ఆరోగ్యానికి బాగా మేలు చేస్తాయి.ఎందుకంటే వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఈ నల్ల యాలకులను వాడడం వలన మనం చక్కటి సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.అంతేకాకుండా నల్ల యాలకులను ఉపయోగించడం వలన జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది.దీంతో పాటు మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్తి ( Constipation, bloating, dyspepsia )లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు నల్ల యాలకులను తీసుకుంటే అలాంటి సమస్యలు దూరం అవుతాయి.అంతేకాకుండా జీవ క్రియ కూడా సాఫీగా సాగుతుంది.
అలాగే వీటిని వాడడం వలన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా ఈజీగా తగ్గిపోతాయి.దగ్గు, బ్రాంకైటిస్ లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నల్ల యాలకులను వాడడం వలన మంచి ఫలితం ఉంటుంది.

ఇక వీటిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ ( Anti-inflammatory )లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.దీంతో శరీరంలో నొప్పులు, వాపులను తగ్గించడంలో ఇవి చాలా చక్కగా సహాయపడతాయి.అలాగే నల్ల యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నశింపజేసి కణాల ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేయడంలో బాగా సహాయపడతాయి.
ఈ యాలకులను వండడం వలన గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.ఈ యాలకుల ఉపయోగించడం వలన నోటి ఆరోగ్యం కూడా బాగుంటుంది.
అలాగే నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గిపోతుంది.







