పండ్లు తినేట‌ప్పుడు అస్స‌లు చేయ‌కూడ‌ని 4 త‌ప్పులు ఇవే!

పండ్లు.ఈ ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 These Are The 4 Mistakes That Should Not Be Made While Eating Fruits , Eating Fr-TeluguStop.com

రోజుకు రెండు రకాల పండ్లను తీసుకుంటే డాక్టర్ అవసరమే ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.పండ్ల ద్వారా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలను పొందొచ్చు.

అలాగే వివిధ రకాల జబ్బులను అడ్డుకునే సామర్థ్యం పండ్లకు ఉంది.అందుకే డైట్ లో సీజనల్ ఫ్రూట్స్ ను చేర్చుకోవాలని చెబుతుంటారు.

అయితే చాలా మంది పండ్లను తినే సమయంలో కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటారు.ఆ తప్పుల వల్ల ఊహించని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా పండ్లు తినే సమయంలో అస్సలు చేయకూడని నాలుగు తప్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా చాలా మందికి భోజనం చేసిన వెంటనే ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది.

మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంట‌నే దానిని వదులుకోండి.ఎందుకంటే భోజనం చేసిన వెంటనే పండ్లు తినకూడదు.

దీని వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.

Telugu Fruits, Fruits Benefits, Tips, Latest-Telugu Health Tips

అలాగే కొందరు పండ్లను కట్‌ చేశాక వాటర్ తో కడుగుతుంటారు.ఇలా చేయడం చాలా తప్పు.ఫ్రూట్స్ ను కట్ చేశాక వాష్ చేయడం వల్ల రుచితో పాటు పలు పోషకాలు కూడా వెళ్లిపోతాయి.

ఫ్రూట్స్ తినే టైం లో కొంద‌రు వాటిపై సాల్ట్ చల్లుకుని తింటుంటారు.రుచి కోసం ఇలా చేస్తుంటారు.కానీ ఇలా చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఫ్రూట్స్ పై సాల్ట్ చల్లుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

పైగా ఫ్రూట్స్ పై సాల్ట్ చల్లడం వల్ల అవి వాటర్ ను బయటకు రిలీజ్ చేస్తాయి.ఈ క్రమంలోనే పలు పోషకాలు కూడా బయటకు వచ్చేస్తాయి.

Telugu Fruits, Fruits Benefits, Tips, Latest-Telugu Health Tips

ఇక కొందరు ఒకేసారి మూడు నాలుగు రకాల పండ్లను కలిపి తీసుకుంటుంటారు.అయితే ఈ క్రమంలోనే రాంగ్ కాంబినేషన్‌ ఫ్రూట్స్‌ను తీసుకుంటారు.వాస్తవానికి స్వీట్ ఫ్రూట్స్ మరియు సిట్రస్ ఫ్రూట్స్ కలిపి పొరపాటున కూడా తీసుకోరాదు.స్వీట్ ఫ్రూట్స్ సిట్రస్ ఫ్రూట్స్ కలిపి తీసుకున్నప్పుడు దాని ప్రభావం జీర్ణ వ్యవస్థ పై పడుతుంది.

దీంతో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube