టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ఒకరు.ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.
ఇలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ సరసన సినిమాలలో నటించడానికి ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు.ఈయన సినిమాలో ఛాన్స్ రావడమే ఆలస్యం ఏమాత్రం ఆలోచించకుండా నటించేవారు ఎంతోమంది ఉన్నారు.

తాజాగా మరో నటి సైతం తాను ఎన్టీఆర్ సినిమాలో నటించడమే తన డ్రీమ్ అంటూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.మరి ఎన్టీఆర్ తో నటించడమే తన కల అంటున్న హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే… సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) ఒకరు.ఇటీవల ఈమె సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఈ సినిమా సక్సెస్ కావడంతో వరుస కార్యక్రమాలలో పాల్గొంటూ ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ తన మనసులో కోరికను బయటపెట్టారు.తనకు ఎన్టీఆర్ గారితో నటించడమే తన డ్రీమ్ అంటూ తెలియజేశారు.
తనకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం అని తెలిపారు.తనని స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి చూస్తున్నానని ఎంతో అద్భుతంగా నటించడమే కాకుండా డాన్స్ కూడా ఇరగదీస్తారు అంటూ చెప్పుకు వచ్చారు.
ఆయనతో నటించే అవకాశం వస్తే కచ్చితంగా వదులుకోనని.తారక్ డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది.
ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటించే విధానం నన్ను ఎన్టీఆర్ అభిమానిగా మార్చేసిందని ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.