యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!

కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతూ కే జి ఎఫ్( KGF ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనాలను సృష్టించారు నటుడు యశ్( Yash ) .ఇలా ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయారు.

 Nayanatara Play Key Role On Yash Toxic Movie,nayanatara,yash,toxic Movie,geethu-TeluguStop.com

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా కే జి ఎఫ్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఇక ఈ సినిమా విడుదలయ్యి కూడా దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు హీరో యశ్ నుంచి మరో సినిమా రాకపోవడంతో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Telugu Nayanatara, Nayanatarakey, Toxic, Yash-Movie

ఇక యశ్ కాస్త ఆలస్యంగా వచ్చిన మరో బ్లాక్ బస్టర్ సినిమా ద్వారానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని స్పష్టం అవుతుంది.ప్రస్తుతం ఈయన మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ దశకత్వంలో రాబోతున్న టాక్సిక్( Toxic )  అనే సినిమాలో నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇటీవల యశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్ వీడియోను విడుదల చేశారు.ఈ వీడియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది.ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమవుతున్నారు.

Telugu Nayanatara, Nayanatarakey, Toxic, Yash-Movie

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ పాత్రలో కనిపించనున్నాడు.ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న టాక్సిక్ సినిమా ఏప్రిల్ 10వ తేదీ విడుదల కానుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరో నటిస్తున్నారు అనే విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు.

పలువురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చిన ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా వెల్లడించలేదు.తాజాగా నటుడు అక్షయ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమాలో నయనతార ( Nayanatara ) భాగం కాబోతున్నారని ఇంతకుమించి తనని ఇంకేమీ అడగద్దు అంటూ తెలియజేశారు.త్వరలోనే ఈ విషయాలన్నింటి గురించి అధికారికంగా ప్రకటన వస్తుంది అంటూ అక్షయ్ ఒబెరాయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube