ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.రోజురోజుకి ఈ కరోనా వైరస్ బారిన పడినటువంటి వ్యక్తుల మరణ గణాంకాలు ఎక్కువవుతున్నాయి.
దీంతో వైద్య నిపుణులు ఈ కరోనా వైరస్ కి మందు కనిపెట్టడం కోసం రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.అయితే తాజాగా పరిశోధకులు కరోనా వైరస్ గురించి మరో కొత్త అంశాన్ని కనుగొన్నారు.
ఇందులో భాగంగా కరోనా వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకున్నటువంటి వ్యక్తితో శృంగారం చేస్తే కరోనా వైరస్ సోకదని వైద్య నిపుణులు పలు ప్రయోగాల ద్వారా తేల్చారు.ఇందుకుగాను గతంలో కరోనా వైరస్ బారినపడి కోలుకున్న కొందరు వ్యక్తుల వీర్యకణాల నమూనాలను తీసుకొని వైద్యులు కరోనా వైరస్ కణాల గురించి వెతకగా ఎటువంటి కోవిడ్ -19 కణాలను గుర్తించలేక పోయారు.
దీంతో వైద్య నిపుణులు కరోనా వైరస్ బారినుంచి కోలుకున్న వ్యక్తులతో శృంగారం చేయడం ద్వారా కరోనా వైరస్ సోకదని నిరూపించారు.అయితే కరోనా వైరస్ సోకిన వ్యక్తితో శృంగారం ప్రాణానికే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు.
అందువల్ల కరోనా వైరస్ సోకిన వ్యక్తులతో కొంత కాలం పాటు సామాజిక దూరం పాటిస్తూ శృంగారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకు మన దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 27,892 కేసులు నమోదు కాగా ఇందులో 6,185 మంది విజయవంతంగా ఈ కరోనా వైరస్ బారినుంచి కోలుకొగా 872 మంది ప్రాణాలను కోల్పోయారు.
దీంతో రోజురోజుకి కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో లాక్ డౌన్ పొడిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.