ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు తింటే ప్రమాదమా..?

ప్రోబయోటిక్స్ తో నిండి ఉండే పెరుగు( curd ) భారతదేశ ప్రజల ఆహారంలో ఒక భాగంగా ఉంటుంది.ఎంతో రుచికరమైన దీన్ని తినేందుకు చాలా మంది ప్రజలు ఇష్టంగా ఉంటారు.

 According To Ayurveda, Is It Dangerous To Eat Curd In Rainy Season , Ayurveda ,-TeluguStop.com

కానీ కొన్ని సంప్రదాయాల ప్రకారం వర్షా కాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల పిత్త, కఫా, వాత దోషాలని ఒకే సారి ప్రభావితం చేస్తుంది.

ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సీజన్ లో వాత, పిత్త దోషాలు తీవ్రతరమవుతాయి.ఇది శరీరానికి హాని చేస్తుంది.

Telugu Ayurveda, Black Pepper, Cough, Curd, Tips, Rainy Season-Telugu Health

కాలానుగుణ అనేక వ్యాధులకు దారితీస్తుంది.మాన్ సూన్ సీజన్ లో పెరుగు తింటే వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఆయుర్వేదం( Ayurveda ) ప్రకారం పెరుగు చల్లటి శక్తిని కలిగి ఉంటుంది.ఇది జీర్ణశక్తిని బలహీనపరుస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు( Digestive Problems) దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది.పెరుగులో చిటికెడు ఎండుమిర్చి వేయించిన జీలకర్ర లేదా తేనె కలపడం వల్ల ఇది శరీరానికి హాని చేయకుండా ఉంటుంది.

పెరుగులో ఏమి కలపకుండా తినడం వల్ల జీర్ణ క్రియ మందగిస్తుంది.

Telugu Ayurveda, Black Pepper, Cough, Curd, Tips, Rainy Season-Telugu Health

ఇంకా చెప్పాలంటే వర్షాకాలంలో రోజు పెరుగు తినడం వల్ల శరీరంలో శ్లేష్మం అభివృద్ధి చెందుతుంది.ఇది జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే వాతావరణంలో తేమ కారణంగా అలర్జీ ప్రమాదాన్ని పెంచుతుంది.

వాతావరణంతో సంబంధం లేకుండా పెరుగు తినకపోతే కొంత మందిలో అన్నం తిన్న తృప్తి అసలు ఉండదు.వర్షాకాలంలో పెరుగు తినాలి అనుకుంటే ఈ పద్ధతిని పాటించారంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు.

చిటికెడు వేయించిన జీలకర్ర పొడి, నల్ల మిరియాలు( Black pepper ), నల్ల ఉప్పు లేదా తేనె జోడించుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇది శక్తిని సమతుల్యం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube