సినిమా రంగంలోకి అడుగు పెట్టే హీరోయిన్లు చాలా మంది తమ పాత పేర్లను కాదని.కొత్త పేర్లు తగిలించుకుంటారు.
సేమ్ అలాగే చేసింది కన్నడ ముద్దుగుమ్మ రేఖ.నిజానికి ఈమె అసలు పేరు ఇది కాదు.మరోవైపు ఆమె మీద చాలా రూమర్లు వచ్చాయి.అదే సమయంలో టాలీవుడ్ ను కాదని కన్నడ పరిశ్రమకు వెళ్లిపోయింది.తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చినా వద్దనుకుంది.ప్రస్తుతం మళ్లీ తెలుగు సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.
ఇంతకీ అప్పుడేం జరిగింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా రేఖ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలలను వెల్లడించింది.
నిజానికి తనకు బుర్రలేకే తెలుగు సినిమాలను వదులుకున్నట్లు చెప్పింది.తెలుగులో కొన్ని ఫ్లాఫులు రాగానే ఇక్కడ పరిస్థితి బాలేదని కర్నాటకకు వెళ్లిపోయినట్లు చెప్పింది.
సొంత సినిమా పరిశ్రమలో నటించాలని భావించినట్లు చెప్పింది.కానీ కొన్ని సినిమాలు చేశాక.
తెలుగులో కొనసాగి ఉంటే బాగుండేదని అనుకుందట.తెలుగులో తను సినిమాలు చేస్తున్న సమయంలోనే రోడ్డు ప్రమాదంలో రేఖ చనిపోయిందని వార్తలు వచ్చాయట.
పేరు మార్చుకుంటే తన మీద వచ్చిన రూమర్ కీడు పొతుందని కొందరు చెప్పారట.అప్పుడే తను పేరు మార్చుకుందట.

తన అసలు పేరు రేఖ వేదవ్యాస్.అయినప్పటికే ఆమె చేసిన సినిమా ఆనందం మూలంగా అందరూ ఆనందం రేఖ అనే పిలుస్తారు.అలా చెప్పుకోవడమే తనకు చాలా ఇష్టం అని అంటుంది రేఖ.అంతేకాదు మణిరత్నం లాంటి దర్శక దిగ్గజంతో సినిమా చేయాల్సి ఉన్నా… బిజీ షెడ్యూల్ మూలంగా చేయలేదని చెప్పింది.ఆయనతో సినిమా చేయకపోవడం మూలంగా ఎంతో మిస్ చేసుకున్నట్లు చెప్పింది.ప్రస్తుతం రేఖ కొన్ని కన్నడ సినిమాలు చేస్తుంది.తాజాగా తెలుగులో ఓ సినిమా చేస్తున్నట్లు చెప్పింది.వెబ్ సిరీస్ లు చేసేందుకు కూడా అవకాశాలు వస్తున్నాయట.
అయితే కాస్త లావుగా తయారైన ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం సన్నబడేందుకు ప్రయత్నిస్తుందట.