మొటిమలు. అన్న మాట వింటేనే భయపడిపోతుంటారు.
యుక్త వయసు నుంచీ ప్రారంభమయ్యే మొటిమలు భరించలేని నొప్పిని కలగజేయడమే కాదు.ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.
అందుకే వాటిని నివారించుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే కొందరికి ముఖంపై మొటిమలు ఏర్పడతాయి.
కానీ, త్వరగా తగ్గవు.దాంతో ఏం చేయాలో తెలియక తెగ సతమతం అయిపోతూ ఉంటారు.
ఈ జాబితాలో మీరు ఉంటే అస్సలు బాధపడకండి.
ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ట్రై చేస్తే ఎంతటి మొండి మొటిమలనైనా ఈజీగా వదిలించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.
వటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్, అర అంగుళం దంచిన అల్లం ముక్క, గుప్పెడు నిమ్మ తొక్కలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్‌ను ఫిల్టర్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి పసుపు కొమ్ముల పొడి, రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ-లెమన్-జింజర్ వాటర్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చేస్తే మొటిమలు సూపర్ ఫాస్ట్‌గా తగ్గిపోతాయి.మరియు వాటి తాలూకు మచ్చలను సైతం ఈ రెమెడీ నివారించగలదు.