త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు లోకకల్యాణార్థం 10 అవతారాలు ఎత్తిన సంగతి మనకు తెలిసిందే.ఈ దశావతారాలు ఎత్తి రాక్షసులను సంహరించి ధర్మం వైపు నిలబడ్డారు.
ఈ విధంగా విష్ణుదేవుడు ఒక్కో అవతారానికి ఒక్కో విశిష్టత ఉంది.ఈ క్రమంలోనే విష్ణుమూర్తిని ఎన్నో రకాల పేర్లతో పిలుస్తుంటారు.
విష్ణు దేవుడని, నారాయణుడని, శ్రీహరి అని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు.అయితే విష్ణు దేవుడికి నారాయణుడు అనే పేరు ఏ విధంగా వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ అనంతమైన విశ్వంలో ప్రతి ఒక్క ప్రాణి జీవించాలంటే నీరు ఎంతో అవసరం.నీరు లేకపోతే మనం జీవించలేమనే విషయం మనకు తెలిసిందే.అయితే విష్ణు దేవుడిని మరొక పేరుతో పిలిచే నారాయణుడిలో నారము అంటే నీరు అనే అర్థం వస్తుంది.అదేవిధంగా ఆయణుడు అంటే దారి చూపే వాడు అని అర్థం.
అంటే సమస్త ప్రాణికోటికి జీవనాధారమైన నీటిని అందించే వాడు కనుక విష్ణు దేవుడిని నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు.అదేవిధంగా పురాణాల ప్రకారం విష్ణుదేవుడు నీటిలో నుంచి ఉద్భవించడం వల్లే నారాయణుడు అనే పేరుతో పిలుస్తారని చెబుతారు.
అదేవిధంగా నారదుడు ఎల్లప్పుడు శ్రీహరిని నారాయణ.నారాయణ అని నామస్మరణ చేస్తూ ఉండటం వల్ల అదే పేరు వచ్చింది.

ఎంతో పరమ పవిత్రమైన గంగానది విష్ణువు పాదాల చెంత ఉద్భవించడం వల్ల విష్ణు పాదోదకం అని పేరు వచ్చిందట.దీంతోపాటు విష్ణువు ఎల్లప్పుడు నీటిపై ఉండటం వల్ల అతడికి నారాయణుడు అనే పేరు వచ్చింది.ఈ విధంగా వివిధ కారణాల చేత విష్ణుమూర్తిని నారాయణుడు అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి.అదేవిధంగా విష్ణుమూర్తి ఎత్తిన దశావతారాలలో ఒక్కో అవతారంలో స్వామివారిని ఒక్కో పేరుతో పూజించేవారు.
ఏ అవతారం ఎత్తిన అది కేవలం లోకకల్యాణార్థం మాత్రమే.అధర్మాన్ని నాశనం చేసి ధర్మం వైపు నిలబడి ధర్మాన్ని కాపాడాడని పురాణాలు మనకు చెబుతున్నాయి.