బుల్లితెరపై ప్రసారమవుతున్న కొన్ని సీరియల్ ఏళ్లతరబడి ప్రసారం అవుతూనే ఉంటాయి.అందులో కొన్ని సీరియల్ లో నాలుగు ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలంలోనే పూర్తికాగా మరికొన్ని సీరియల్స్ మాత్రం ఏళ్ళతరబడి ప్రసారం అవుతూనే ఉంటాయి.
అలాంటి వాటిలో తారక్ మెహతా కా ఉల్టా చష్మా సీరియల్ కూడా ఒకటి.ఈ తారక్ మెహతా కా ఉల్టా చష్మా సీరియల్ గురించి తెలియని హింది ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెరపై ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది.
ఈ సీరియల్ లో నటించే నటీనటులకూడా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు దక్కాయి.
ఇక ఈ సీరియల్ లో తారక్ మెహతా భార్య అంజలి మెహత పాత్రలో నటించిన నేహా ఈ సీరియల్ నిర్మాతలు తనకు డబ్బులు ఇవ్వడం లేదు అంటూ పలు సార్లు మీడియా ముందు వాపోయింది.స్నేహ ఈ సీరియల్ నుంచి 2029 లోనే తప్పుకుంది.
ఆ సమయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు ఆరు నెలల నుంచి రెమ్యూనరేషన్ అందలేదని, ఈ బకాయిలను ఇంకెప్పుడు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ మధ్య కూడా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇంత వరకు పూర్తిగా పారితోషికం అందనేలేదని అసహనానికి లోనైంది నేహ.
ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె ఆరోపణలపై తారక్ మెహతా కా ఉల్టా చష్మా నిర్మాతలు స్పందించారు.ఆర్టిస్టులను మేము కుటుంబంగా పరిగణిస్తాము.

నేహా ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాక కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని చెప్పాము.ఈ ధారావాహిక నుంచి ఎగ్జిట్ అవుతున్నట్లుగా కొన్ని పత్రాలపై సంతకం చేయాలని సూచించాము.కంపెనీ పాలసీ ప్రకారం ఆ సంతకం చేసిన తర్వాతే ఆమెకు సెటిల్‌మెంట్ చేయగలం.ఆమెతో మాట్లాడేందుకు రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం.కానీ ఆమె ఖాతరు చేయడం లేదు.అంతేకాదు ఈ సీరియల్ నుంచి కూడా చెప్పాపెట్టకుండా తప్పుకుంది.12 ఏళ్లపాటు ఫేమ్, మంచి కెరీర్‌ను ఇచ్చిన మేకర్స్‌పై అసత్య ఆరోపణలు చేయడానికి బదులుగా మెయిల్స్‌కు స్పందిస్తే బాగుంటుంది అంటూ నీలా ఫిలిం ప్రొడక్షన్స్ ఓ లేఖను విడుదల చేసింది.ఇకపోతే తారక్ మెహతా కా ఉల్టా చష్మా 2008లో ప్రారంభమైంది.13 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ నిర్విరామంగా ముందుకు సాగుతోంది.