ఒత్తైన, పొడవాటి కురులను ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలు కూడా జుట్టు విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు.
కానీ పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను వాడటం వల్ల రకరకాల జుట్టు సమస్యలు వేధిస్తుంటాయి.వాటిని వదిలించుకోవడం కోసం తెలిసిన రెమెడీలన్నీ ప్రయత్నిస్తుంటారు.
అయితే ఒత్తైన ఆరోగ్యమైన కురులకు పైపై పూతలే సరిపోవు.మంచి ఆహారం కూడా తీసుకోవాలి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పండ్లు మీ జుట్టును ఆరోగ్యంగా మరియు ఒత్తుగా మార్చడానికి అద్భుతంగా తోడ్పడతాయి.ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది అవకాడో( Avocado ).ఖరీదు ఎక్కువే అయినప్పటికీ ఈ పండులో విటమిన్ ఈ మరియు హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా నిండి ఉంటాయి.ఇవి మన జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.
హెయిర్ ఫాల్ ను అరికట్టి జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.

అలాగే బొప్పాయి ( Papaya )ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే కురుల సంరక్షణకు సైతం బొప్పాయి గ్రేట్ గా సహాయపడుతుంది.రోజుకు ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలు తినడం వల్ల స్కాల్ప్ హైడ్రేటెడ్ గా ఉంటుంది.
చుండ్రు సమస్య దరిచేరకుండా ఉంటుంది.జుట్టు రాలడం సైతం తగ్గుతుంది.
స్ట్రాబెర్రీ పండ్లు( Strawberry ) కూడా హెల్తీ హెయిర్ ను ప్రమోట్ చేస్తాయి.స్ట్రాబెర్రీ పండ్లలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తాయి.
హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తాయి.ఇక ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ వంటి సిట్రస్ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాదు హెయిర్ డ్యామేజ్ సమస్య సైతం దూరం అవుతుంది.
సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.