మన ముఖంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో పెదవులు ఒకటి.పెదవుల ఆకారాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మరియు లక్షణాలను తెలుసుకోవచ్చు.
ఇప్పుడు ఎటువంటి పెదవులు ఉంటె వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
సాధారణ పెదవులు
సాధారణ పెదవులు కలిగిన వారు వారికీ ఇచ్చిన పనులను సాధారణ మానసిక శక్తితో
చేస్తారు.
వారి గురించి ఇతరులు మాట్లాడినప్పుడు వారి సామర్ధ్యాలు మరియు బలాలు కనిపిస్తాయి.వీరు విమర్శలను కూడా చాలా తేలిగ్గా తీసుకుంటారు.
అలాగే ఇతరుల అభిప్రాయాన్ని గౌరవిస్తారు.
పై పెదవి చాలా పదునుగా ఉంటె
పై పెదవి చాలా పదునుగా ఉన్నవారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది.
వీరు ఎక్కువగా ప్రతిభావంతులైన కళాకారులుగా మరియు సంగీత విద్వాంసులుగా ఉంటారు.అద్భుతమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు.
స్వీయ భావ వ్యక్తీకరణ కోసం పోరాటం చేస్తూ ఉంటారు.వీరు ఎల్లప్పుడూ పనిలో మంచి ఫలితాలను పొందాలని కష్టపడతారు.
పై పెదవి పెద్దదిగా ఉంటే
పై పెదవి పెద్దదిగా ఉన్నవారు భావోద్వేగభరితంగా, ఆకర్షణీయంగా ఉంటారు.వారి
జీవితాన్ని సంపూర్ణంగా ప్రేమిస్తారు.
సొంత అభిప్రాయాలను కలిగి ఉంటారు.ఇతరులు తమ వైపుకు ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
సాధారణంగా వీరు ఇతరుల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటారు.
కింద పెదవి, పై పెదాల కంటే పెద్దదిగా ఉంటే
కింద పెదవి, పై పెదాల కంటే పెద్దదిగా ఉన్నవారు ఆనందాన్ని ఆస్వాదిస్తూ
ఉంటారు.
తరచుగా కొత్త ప్రదేశాలకు వెళుతూ ఉంటారు.వారు ప్రయాణించే మార్గంలో ఎదురయ్యే కొత్త విషయాల పట్ల ఆసక్తికరంగా, స్నేహశీలిగా ఉంటారు.
సాహస భరితమైన మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడతారు.
బొద్దుగా ఉండే పెదవులు
బొద్దుగా ఉండే పెదవుల వారిని ఇతరులు ఆలా చూస్తూ ఉండిపోతారు.
వీరు తమ కన్నా చిన్నవారైనా తోబుట్టువులను చాలా ప్రేమగా చూస్తారు.ఇతరులను కాపాడాలన్న మరియు రక్షించాలన్న ఒక బలమైన కోరికను కలిగి ఉంటారు.
ఇటువంటి అబ్బాయిలు సాధారణంగా ఉత్తమమైన తల్లిదండ్రులుగా తయారవుతారు.